హైదరాబాద్Miyapur Girl Death | నీటి సంపులో పడి బాలిక మృతి

Miyapur Girl Death | నీటి సంపులో పడి బాలిక మృతి

నీటి సంపులో పడి మృతి 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలోని మియాపూర్ పరిధిలో ఓ అపార్ట్​మెంట్​లో చోటు చేసుకుంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Miyapur Girl Death | నీటి సంపులో పడి మృతి 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని మియాపూర్ పరిధిలో ఓ అపార్ట్​మెంట్​లో సోమవారం రాత్రి చోటు చేసుకుంది.

భద్రాది కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా టేకులపల్లి మండలం మద్దిరాల తండాకు చెందిన చరణ్, రేణుక దంపతులు బతుకు దెరువు కోసం హైదరాబాద్​ నగరానికి వలస వచ్చారు. పలు ప్రాంతాల్లో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో చరణ్​ వారం క్రితమే శ్రీరెసిడెన్సీ​ అపార్ట్​మెంట్​లో పనికి చేరాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చరణ్​ కుటుంబంతో కలిసి అపార్ట్​మెంట్​ గ్రౌండ్​ ఫ్లోర్​లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో రాత్రి 7:30 గంటల సమయంలో వారి కుమార్తె సారా అపార్ట్‌మెంట్ ఆవరణలో మూత తీసి ఉన్న నీటి సంపులో పడిపోయింది.

Miyapur Girl Death | కనిపించకపోవడంతో..

సారా సంపులో పడి పోయిన విషయాన్ని తల్లిదండ్రులు గమనించలేదు. బాలిక కనిపించకపోవడంతో చుట్టు పక్కల గాలించారు. ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో అనుమానం వచ్చి నీటి సంపులో చూశారు. అప్పటికే బాలిక అచేతనంగా కనిపించింది. వెంటనే నిజాంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Miyapur Girl Death | తల్లిదండ్రుల అనుమానం

సమాచారం అందుకున్న మియాపూర్​ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అయితే బాలిక మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా.. ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Street Dog Attack | హైదరాబాద్​లో దారుణం.. బాలుడిపై 10 వీధికుక్కల దాడి

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

JCD Prabhakar Politics|తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ ఏకగ్రీవ ఎన్నిక

అక్షరటుడే వెబ్‌డెస్క్:JCD Prabhakar Politics|నటుడిగా ప్రజాదరణ పొంది, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన...

Hyundai New SUV | హ్యుందాయ్ నుంచి కొత్త కారు.. వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyundai New SUV | ఆటోమొబైల్ రంగ దిగ్గజ...

Cow Slaughter Ban | గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి: వీహెచ్‌పీ డిమాండ్

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Cow Slaughter Ban | గోవధ చట్టాన్ని పక్కాగా...

India Toy Industry | ప్రపంచానికి ‘బొమ్మ’ చూపిస్తున్న భారత్.. ఆత్మనిర్భరత దిశగా ముందడుగు

అక్షరటుడే, వెబ్​డెస్క్: India Toy Industry | భారత్ బొమ్మల తయారీ...