అక్షరటుడే వెబ్‌డెస్క్: itel Muzik 450L | ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్ ‘ఐటెల్’ (itel) మార్కెట్లోకి మ్యూజిక్ ( music )ప్రియులను ప్రత్యేకంగా ఆకట్టుకునేలా సరికొత్త ఫీచర్ ఫోన్‌ను తీసుకువచ్చింది. ‘itel Muzik 450L (it5095L)’ పేరుతో విడుదలైన ఈ మ్యూజిక్-ఫస్ట్ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. కేవలం రూ.1,659 ధరకే లభించే ఈ ఫోన్, ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారికి , రద్దీ ప్రాంతాల్లో ఉండే వారికి అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.
itel Muzik 450L | సూపర్ లౌడ్ 3డీ సౌండ్..
ఈ ఫోన్లో ప్రత్యేకంగా F20 2-in-1 లౌడ్ స్పీకర్‌ను ఏర్పాటు చేశారు. “Super Loud 3D Sound – More music. More FM. More calls” అనే ప్రత్యేక ఫోకస్‌తో దీనిని తీర్చిదిద్దారు. దీని ద్వారా మ్యూజిక్, ఎఫ్ఎం రేడియో , కాల్స్ అత్యంత స్పష్టంగా, పెద్ద శబ్దంతో వినిపిస్తాయి. సాధారణ ఫోన్ ఆడియో సరిగ్గా వినిపించని రద్దీ ప్రదేశాలలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
itel Muzik 450L | ఆకర్షణీయమైన డిజైన్..
ప్రయాణాల్లో బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ లేకుండా ఉండేందుకు ఇందులో 2500mAh మెగా బ్యాటరీని అందించారు. బ్లూటూత్ కనెక్టివిటీ, వైర్లెస్ ఎఫ్ఎం వినే సదుపాయంతో పాటు రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది. భారీ స్పీకర్ ఉన్నప్పటికీ, ఫోన్ కేవలం 13.4 మి.మీ. స్లిమ్ డిజైన్‌తో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇందులో 2.4 అంగుళాల క్యూవీజీఏ (QVGA) డిస్ప్లేను అమర్చారు.
ఈ ఫోన్లో రోజువారీ అవసరాలకు ఉపయోగపడే అనేక అధునాతన ఫీచర్లను పొందుపరిచారు. కింగ్ టాల్కర్ (King Talker), విజువల్ ఐకాన్లతో 1,000 కాంటాక్ట్‌లను సేవ్ చేసుకునే వెసులుబాటు, ఆటో కాల్ రికార్డింగ్, ‘0’ బటన్‌ను లాంగ్ ప్రెస్ చేస్తే టైమ్ చెప్పే ఫీచర్, పవర్ఫుల్ టార్చ్, వీజీఏ (VGA) కెమెరా వంటివి ఉన్నాయి.
itel Muzik 450L | లభ్యత వివరాలు..
ఈ ఫోన్ ఆధునికతకు తగినట్లుగా టైప్-సి (Type-C) ఛార్జింగ్ సదుపాయంతో వస్తుంది. అంతేకాకుండా బాక్స్‌లోనే ఉచితంగా బ్యాక్ కవర్ లభిస్తుంది. ఇది మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది. తయారీలో ఏవైనా లోపాలు తలెత్తితే ఒక సంవత్సరం పాటు ‘కౌంటర్ రీప్లేస్మెంట్ గ్యారెంటీ’ (1-Year Counter Replacement Guarantee) అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఇది కూడా చదవండి: RTC Bus Accident | ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. మహిళ మృతి