Ultraviolette Anantapur | బైక్ ప్రియులకు గుడ్ న్యూస్.. అనంతపురంలో అల్ట్రావయోలెట్ కొత్త ‘యూవీ స్పేస్ స్టేషన్’ ప్రారంభం

ఎలక్ట్రిక్ టూవీలర్ రంగంలో దూసుకెళ్తున్న ప్రముఖ సంస్థ అల్ట్రావయోలెట్ (Ultraviolette) ఆటోమోటివ్ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో తన కొత్త అనుభవ కేంద్రం (యూవీ స్పేస్ స్టేషన్)ను ప్రారంభించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ultraviolette Anantapur | ఎలక్ట్రిక్ టూవీలర్ రంగంలో దూసుకెళ్తున్న ప్రముఖ సంస్థ అల్ట్రావయోలెట్ (Ultraviolette) ఆటోమోటివ్ తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని  ( Andhra Pradesh ) అనంతపురంలో తన కొత్త అనుభవ కేంద్రం (యూవీ స్పేస్ స్టేషన్)ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా తమ రిటైల్ కార్యకలాపాలను విస్తరిస్తున్న క్రమంలో ఈ ఏర్పాటు చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

Ultraviolette Anantapur | ఆటోమొబైల్స్ భాగస్వామ్యంతో..

స్థానిక డీలర్ మెస్సర్స్ చిదంబరేశ్వర ఆటోమొబైల్స్ భాగస్వామ్యంతో ఈ కొత్త కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ కంపెనీకి చెందిన అత్యాధునిక ఎక్స్-47 క్రాస్‌ఓవర్, ఎఫ్77 ఎస్ వంటి హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటర్‌సైకిళ్లను నేరుగా పరిశీలించవచ్చు. టెస్ట్ రైడ్స్, సేల్స్ ఎంక్వైరీలు, ప్రత్యేక సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ లభ్యత వంటి పూర్తి సేవలు ఒకే చోట లభించనున్నాయి. వాహనాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక సర్వీస్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

Ultraviolette Anantapur | ఎలక్ట్రిక్ బైక్స్ ప్రత్యేకతలు..

అల్ట్రావయోలెట్ ఫ్లాగ్‌షిప్ మోడల్స్ అయిన ఎక్స్-47, ఎఫ్77 బైక్స్ అద్భుతమైన పనితీరును కనబరుస్తాయి. ఇవి 40.2 హెచ్‌పి పవర్, 100 ఎన్ఎం టార్క్‌ను అందిస్తాయి. కేవలం 2.8 సెకన్లలోనే 0 నుంచి 60 కి.మీ వేగాన్ని అందుకుంటాయి. 10.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న ఈ బైక్‌లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 323 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను ఇస్తాయి. ప్రపంచంలోనే మొదటిసారిగా రాడార్ సిస్టమ్‌తో కూడిన ఎక్స్-47 క్రాస్‌ఓవర్‌లో బ్లైండ్-స్పాట్ డిటెక్షన్, లేన్-ఛేంజ్ అసిస్ట్, రియర్-కొలిజన్ వార్నింగ్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

ఈ సందర్భంగా అల్ట్రావయోలెట్ సీఈఓ నారాయణ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. ఏపీలో వ్యాపారాన్ని విస్తరించడంలో అనంతపురం కీలకమైన మార్కెట్ అని తెలిపారు. ఇక్కడి పారిశ్రామిక వృద్ధి, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుండటం తమకు ఎంతో ఉత్సాహాన్నిస్తోందని పేర్కొన్నారు. మెట్రో నగరాలకే పరిమితం కాకుండా హై-పెర్ఫార్మెన్స్ ఈవీలను చిన్న నగరాలకు కూడా విస్తరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇది కూడా చదవండి:  Paddy Procurement | రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *