అక్షరటుడే వెబ్‌డెస్క్: Kavitha CBI Probe | తెలంగాణ శాసనసభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తన కుటుంబ ఆస్తులపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ‘ఎక్స్’ (X) వేదికగా ఆమె ఒక సంచలన ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల అఫిడవిట్‌లో తాను వెల్లడించిన ఆస్తుల కన్నా ఒక్క గజం భూమి ఎక్కువగా ఉన్నట్లు నిరూపించినా, ఆ భూమిని ప్రభుత్వానికే సరెండర్ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. సీఎం అసెంబ్లీలో ప్రస్తావించిన భూముల చిట్టాపై నమ్మకం లేదని, నిజాలు నిగ్గు తేల్చడానికి ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
Kavitha CBI Probe | సీబీఐ విచారణ జరిపించాలి..
తన కుటుంబంపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అబద్ధాలు ప్రచారం చేశారని కవిత మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తమ వద్ద ఎలాంటి అక్రమ భూములు లేవని, ఎన్నికల అఫిడవిట్‌లో చూపినదానికంటే అదనంగా తన కుటుంబం పేరిట ఒక్క గజం భూమి ఉన్నా నిస్సంకోచంగా ప్రభుత్వానికి అప్పగిస్తామని తేల్చిచెప్పారు. ప్రజాక్షేత్రంలో తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఆమె తీవ్రంగా తిప్పికొట్టారు. అసెంబ్లీలో సీఎం చదివిన భూముల వివరాలపై పూర్తి స్థాయి నిజాలు బయటకు రావాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై తమకు ఎలాంటి నమ్మకం లేదని స్పష్టం చేశారు.
Kavitha CBI Probe | కవిత డిమాండ్..
గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, రామేశ్వర్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, నవీన్ రావు, కొండల్ రావు వంటి ప్రముఖులతో పాటు.. సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రతి ఒక్కరి భూముల వివరాలపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కవిత డిమాండ్ చేశారు.
ఎన్నికల అఫిడవిట్ లో నేను ప్రస్తావించిన నా ఆస్తులకన్నా గజం భూమి ఎక్కువగా ఉన్నా ఆ భూమిని ప్రభుత్వానికే సరెండర్ చేస్తాను
అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి నా కుటుంబానికి ఎక్కడో భూములు ఉన్నట్టు అబద్ధాలు చెప్పారు
అసలు ఈ ముఖ్యమంత్రి పైనే మాకు నమ్మకం లేదు.. అసెంబ్లీలో ఈరోజు సీఎం… pic.twitter.com/0dimCUmKNT
— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 16, 2026
ఇది కూడా చదవండి: Meta One Subscription | మెటా వన్ సబ్‌స్క్రిప్షన్లు షురూ.. ఇన్‌స్టా, వాట్సాప్, ఫెస్‌బుక్‌లలో పెయిడ్ సర్వీసుల ధరలు ఇవే!