Xi Jinping Health | చైనా అధినేత జిన్‌పింగ్‌కు అనారోగ్యం.. రహస్యంగా ఆస్పత్రికి తరలింపు..?

చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Xi Jinping Health | చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇటీవల బ్రిక్స్ (BRICS) సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన ఆయన, తిరిగి చైనాకు వెళ్లిన వెంటనే ఆస్పత్రిలో చేరినట్లు కొన్ని మీడియా సంస్థలు నివేదించాయి. అయితే, ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, సోషల్ మీడియా వేదికగా ఆయన ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

Xi Jinping Health | అనారోగ్య లక్షణాలు..

భారత్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సమయంలోనే జిన్‌పింగ్ ఆరోగ్యంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రసంగిస్తున్న సమయంలో జిన్‌పింగ్‌ను గమనించి కొద్దిసేపు తన ప్రసంగాన్ని ఆపడం చర్చనీయాంశమైంది. అంతేకాకుండా, భారత్ ఏర్పాటు చేసిన అధికారిక విందుకు ఆయన హాజరుకాకపోవడం సందేహాలను మరింత పెంచింది. విమానం ఎక్కుతున్న సమయంలో ఆయన చాలా బలహీనంగా కనిపించారని, సరిగ్గా నడవలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.

Xi Jinping Health | బీజింగ్‌లో అత్యవసర చికిత్స?

భారత్ పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో బీజింగ్‌కు చేరుకున్న జిన్‌పింగ్‌కు ఎయిర్‌పోర్టులో ఎప్పట్లాగా ఘనస్వాగతం లభించలేదని సమాచారం. ఆయన ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వెంటనే అత్యంత రహస్యంగా హెలికాప్టర్‌లో ఓ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. బ్రిక్స్ సదస్సు సమయంలోనే ఆయన స్పృహ కోల్పోయారని, ఆ తర్వాత వైద్య సహాయం అందించినట్లు ఆన్‌లైన్ పోస్టులు పేర్కొంటున్నాయి. వైద్య పరీక్షల్లో ఆయన తీవ్ర ఇస్కీమిక్ స్ట్రోక్‌కు గురైనట్లు నిర్ధారించారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. చైనా డెమోక్రసీ పార్టీ చైర్మన్ షీ వాంజున్ తన ‘ఎక్స్’ (X) ఖాతాలో ఈ ఆరోపణలు చేసినట్లు పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే, దీనిపై చైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.

దీనిని కూడా చదవండి : Revanth Reddy Land| 30 రోజుల్లో ఫామ్‌హౌస్‌ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను దళితులకు పంపిణీ చేస్తాం: సీఎం రేవంత్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *