అక్షరటుడే, వెబ్‌డెస్క్: Miss World 2026 Winner | ప్రపంచ ప్రఖ్యాత అందాల పోటీ ‘మిస్ వరల్డ్-2026’ గ్రాండ్ ఫినాలే వైభవంగా ముగిసింది. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్కు చెందిన సుందరి జోహైరీ మోలా (Johairy Mola) కైవసం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పాల్గొన్న సుందరీమణులను వెనక్కి నెట్టి ఆమె ఈ ఘనత సాధించారు.
Miss World 2026 Winner | రన్నరప్‌గా ఎవరంటే..
పూర్వపు ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్-2025) సుచాతా చేతుల మీదుగా జోహైరీ మోలా ఈ ప్రతిష్ఠాత్మక విజేత కిరీటాన్ని ధరించారు.
ఈ పోటీల్లో స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రెయిన్స్ (Elizabeth Rains) ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, మలేషియాకు చెందిన టానూసియా చెట్టి (Tanushree/Tanusia Chetty) సెకండ్ రన్నరప్‌గా ఎంపికయ్యారు.
Miss World 2026 Winner | భారత సుందరికి నిరాశ..
ఈ ఏడాది భారత్ తరఫున ప్రతినిధిగా బరిలోకి దిగిన నిఖితా పోర్వాల్ పోటీల్లో ఆకట్టుకున్నప్పటికీ, ఆశించిన ఫలితాన్ని సాధించలేకపోయారు. ఆమె టాప్-40 రౌండ్‌తోనే తన ప్రస్థానాన్ని ముగించి నిష్క్రమించాల్సి వచ్చింది. మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన జోహైరీ మోలాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, సినీ, మోడలింగ్ రంగానికి చెందిన ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.