అంతర్జాతీయంTrump Xi Meeting | జిన్​పింగ్​ గొప్ప స్నేహితుడు : డోనాల్డ్ ట్రంప్​

Trump Xi Meeting | జిన్​పింగ్​ గొప్ప స్నేహితుడు : డోనాల్డ్ ట్రంప్​

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్​ చైనా పర్యటనలో భాగంగా రెండో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ జిన్‌పింగ్‌తో సమావేశం అయ్యారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Xi Meeting | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్​ (Donald Trump) చైనా పర్యటనలో భాగంగా రెండో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ షీ జిన్‌పింగ్‌తో సమావేశం అయ్యారు. ట్రంప్​కు చైనాలో ఘన స్వాగతం లభించింది. ఇటీవలి చరిత్రలో 47వ అధ్యక్షుడికి లభించినంత గౌరవం మరే ఇతర అధ్యక్షుడికీ లభించలేదు.

చైనా నాయకుడు షీ జిన్‌పింగ్, బీజింగ్‌లోని కమ్యూనిస్ట్ పార్టీ (Communist Party) రహస్య నాయకత్వ ప్రాంగణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చివరి సమావేశాల కోసం ఆతిథ్యం ఇస్తున్నారు.ఈ శిఖరాగ్ర సమావేశంలో జిన్‌పింగ్ అమెరికా-చైనా సంబంధాన్ని ప్రపంచంలోనే అత్యంత కీలకమైనదిగా అభివర్ణించారు. ట్రంప్‌తో మాట్లాడుతూ, “మనం దీనిని విజయవంతం చేయాలి, ఎప్పటికీ చెడగొట్టకూడదు” అని అన్నారు.

Trump Xi Meeting | సైనిక చర్య కొనసాగుతోంది

ఇరాన్‌పై తన సైనిక చర్య కొనసాగుతుంది అని ట్రంప్ అన్నారు. దాడులను పునఃప్రారంభించడం గురించి ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. టెహ్రాన్‌కు సైనిక పరికరాలు అందించబోమని జిన్​పింగ్​ (Jinping) హామీ ఇచ్చారని అన్నారు. ద్వైపాక్షిక తేనీరు సమావేశం ప్రారంభంలో ట్రంప్ మాట్లాడుతూ, జిన్​పింగ్​ “నేను ఎంతో గౌరవించే వ్యక్తి” అని, అతను “నిజానికి ఒక స్నేహితుడు అయ్యాడు” అన్నారు. ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలున్న చైనా హర్ముజ్ జలసంధి తెరుచుకోవాలని కోరుకోవడంలో అమెరికాతో ఏకీభవిస్తోందని చెప్పారు.

ఇది కూడా చదవండి..: Modi Lavrov Meeting | ప్రధాని మోదీతో రష్యా విదేశాంగ మంత్రి భేటీ

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hyderabad Land Rover Crash | హైదరాబాద్​లో ల్యాండ్​రోవర్​ కారు బీభత్సం

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Hyderabad Land Rover Crash | హైదరాబాద్​ (Hyderabad)నగరంలో...

Gas Cylinder Escort| గ్యాస్ సిలిండర్ల బండికి భారీ పోలీస్ ఎస్కార్ట్ ..ఎక్కడంటే!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Gas Cylinder Escort|సాధారణంగా ముఖ్యమంత్రులో, మంత్రులో వెళ్తుంటే భారీ పోలీస్...

Stock Market Gains | ఐటీ సెక్టార్‌లో కొనుగోళ్ల మద్దతు.. లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Gains | ఐటీ షేర్లలో...

Forest Wildlife Conservation | అటవీ, వన్యప్రాణి సంరక్షణకు ప్రత్యేక ప్రణాళిక: డీఎఫ్​​వో సిద్ధార్థ విక్రమ్​ సింగ్

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ​: Forest Wildlife Conservation | అటవీ, వన్యప్రాణి...