అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rupee Value Fall | ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న భౌగోళిక, రాజకీయ సమీకరణాల వల్ల రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. బుధవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే ఆల్‌టైం కనిష్టానికి పడిపోయింది. డాలర్ (Dollar)తో పోలిస్తే భారత రూపాయి విలువ 20 పైసలు క్షీణించి.. 96.90 చేరింది.
Rupee Value Fall | అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో
ఇరాన్ – అమెరికా మధ్య సైనిక ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ మార్కెట్ (Global Market)లో డాలర్ ఇండెక్స్ బలోపేతం అయ్యింది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ రేటు భారీగా పెరిగాయి. దీంతో ఈ ప్రభావం రూపాయిపై పడి చరిత్రలో కనిష్టస్థాయికి పడిపోయింది.
Rupee Value Fall | అత్యధికంగా చమురు దిగుమతులపై ఆధారపడడంతో
భారత్ తన చమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీనివల్ల చమురు ధరలు పెరిగిన సమయంలో దేశం నుంచి డాలర్ల చెల్లింపు పెరుగుతోంది. ఈ కారణంగా రూపాయి విలువ మరింత తగ్గుతోంది. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, మరోవైపు రూపాయి విలువ దిగజారడం వల్ల దేశంలోకి దిగుమతి అయ్యే ఎలక్ట్రానిక్స్, ముడిసరుకులు మరింత పెరిగి ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దేశీయంగా ధరల పెరుగుదలకు కూడా దారితీసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: Crude oil prices | ఆయిల్ ధరలు పడిపోతాయ్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్


