Siddipet Incvident | సిద్దిపేటలో షాకింగ్ ఘటన.. బీర్ బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Siddipet Incvident | తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో (Siddipet District) షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా బీర్ బాటిళ్లలో పురుగులు, ఇతర వస్తువులు కనిపించిన ఘటనల గురించి అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి. అయితే ఈసారి ఏకంగా సీల్ చేసిన బీరు బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్ కనిపించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటనతో బీరు వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లిలోని వైన్ షాపు నుంచి ఓ వ్యక్తి కింగ్‌ఫిషర్ లైట్ బీర్లను కొనుగోలు చేశాడు. ఇంటికి వెళ్లిన తర్వాత కొన్ని బాటిళ్లు వినియోగించిన అతడు, ఇంకా సీల్ తీయ‌ని మరో బాటిల్‌ను పరిశీలించే సమయంలో అందులో అనుమానాస్పద వస్తువు కనిపించినట్లు గుర్తించాడు.

Siddipet Incvident | బాటిల్‌లో కండోమ్ ప్యాకెట్..

మరింత దగ్గరగా పరిశీలించగా, బాటిల్ లోపల కండోమ్ ప్యాకెట్ (Condom Packet) ఉన్నట్లు కనిపించడంతో అతడు షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఆ బాటిల్‌ను తీసుకుని తిరిగి వైన్ షాపునకు వెళ్లి సిబ్బందిని ప్రశ్నించాడు. అయితే అక్కడి సిబ్బంది నిర్లక్ష్యంగా స్పందించినట్లు సమాచారం. దీంతో బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న బాధితుడు వెంటనే స్థానిక ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. బాటిల్ తయారీ సమయంలో ఏవైనా లోపాలు జరిగాయా? లేక ఎవరైనా కావాలనే ఇలాంటి చర్యకు పాల్పడ్డారా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Siddipet Incvident | నిజంగా తయారీ లోపమా..

ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) వైరల్ కావడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. వినియోగదారుల భద్రత, నాణ్యత ప్రమాణాలపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఉత్పత్తుల తయారీలో మరింత కఠినమైన నాణ్యత తనిఖీలు అవసరమని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. అయితే దర్యాప్తు పూర్తయ్యాకే అసలు కారణాలపై స్పష్టత రానుంది. ఈ ఘటన వెనుక నిజంగా తయారీ లోపమా, లేక మరేదైనా కారణమా అనే అంశంపై అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Matrimonial fraudster arrested | మెడలో తాళి కడతానని.. అకౌంట్ ఖాళీ చేస్తాడు.. మాట్రిమోని కిలాడీ ‘కామేషు’ వేషాలు మామూలుగా లేవుగా!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *