అక్షరటుడే, వెబ్‌డెస్క్: Matrimonial fraudster arrested | పెళ్లి పీటలు ఎక్కించి, జీవితాంతం తోడుంటానంటూ నమ్మబలుకుతాడు. సాఫ్ట్ వర్డ్స్, అందమైన ఫొటోలతో ఆన్‌లైన్‌లో వల వేస్తాడు.
కట్ చేస్తే.. లక్షలాది రూపాయల బాధితుల సొమ్ముతో గోవా క్యాసినోలలో జూదమాడుతాడు. మాట్రిమోనియల్ సైట్లలో నకిలీ ప్రొఫైళ్లతో అమాయక మహిళలను బురిడీ కొట్టిస్తున్న అంతర్రాష్ట్ర కేటుగాడు మందా వెంకట కామేషు ఆట కట్టించారు సైబరాబాద్ క్రైమ్ పోలీసులు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 20కి పైగా పెళ్లిళ్ల మోసాలకు పాల్పడిన ఈ ‘కిలాడీ పెళ్ళికొడుకు’ను ఎట్టకేలకు హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Matrimonial fraudster arrested | మాయమాటలతో వల..
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరానికి చెందిన మందా వెంకట కామేషు ఈజీగా డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.
అందుకోసం అతను ఎంచుకున్న మార్గం – ‘మాట్రిమోనియల్ ఫ్రాడ్’. తెలుగు మాట్రిమోని, బ్రాహ్మిణ్, రెడ్డి, కమ్మ మాట్రిమోని వంటి ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లలో హై-ప్రొఫైల్, లగ్జరీ లైఫ్‌స్టైల్ ఉన్నట్లు నకిలీ ప్రొఫైళ్లను సృష్టించేవాడు.
తాను బాగా సెటిల్ అయిన వ్యక్తినని, రూ.కోట్లలో ఆస్తులు ఉన్నాయని నమ్మబలుకుతూ సంబంధాల కోసం చూస్తున్న మహిళలను టార్గెట్ చేసేవాడు.
ప్రొఫైల్ చూసి నిజమేనని నమ్మిన బాధితులతో వాట్సప్ కాల్స్, ఇన్‌స్టాగ్రామ్ ఛాటింగ్‌ల ద్వారా రోజులు, నెలల తరబడి మాట్లాడుతూ.. యువతులను తన మాయలో పడేలా చేసుకునేవాడు.
Matrimonial fraudster arrested | ఎమర్జెన్సీ డ్రామాలు..
నమ్మకం కుదిరిన తర్వాత అసలు కథ మొదలుపెట్టేవాడు. వ్యాపారంలో ఆకస్మిక నష్టాలు వచ్చాయనో.. అత్యవసర వైద్య ఖర్చులనో.. బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయ్యాయనో.. రకరకాల అబద్ధాలు చెప్పి బాధితుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులను తన ఖాతాలకు బదిలీ చేయించుకునేవాడు.
అంతటితో ఆగకుండా నమ్మకంతో ఇచ్చిన వారి క్రెడిట్ కార్డ్ వివరాలు, బ్యాంక్ యూజర్ ఐడీలు, చివరకు ఓటీపీ (OTP)లను సైతం సేకరించి అకౌంట్లు ఖాళీ చేసేవాడు.
బాధితుల నుంచి దోచుకున్న ఈ లక్షలాది రూపాయలను కామేషు దేనికి వాడాడో తెలిసి పోలీసులే విస్తుపోయారు.
ఇలా పెళ్లిళ్ల పేరిట సంపాదించిన డబ్బునంతా ఇతగాడు గోవాలోని క్యాసినోలలో, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లలో జూదమాడి పూర్తిగా తగలేశాడని విచారణలో తేలింది.
Matrimonial fraudster arrested | 20 కేసులు..
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని ట్రాక్ చేసి అరెస్టు చేశారు.
ఇతనిపై ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో 20కి పైగా చీటింగ్, మాట్రిమోనియల్ మోసం కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.
Paidi Rakesh Reddy POCSO | పొక్సో కేసు వ్యక్తిగత వ్యవహారం…..


