అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pawan Kalyan Surgery | ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఆపరేషన్ విజయవంతం అయింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ కాగా.. తొలుత కుడి భుజానికి శస్త్ర చికిత్స చేశారు.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు 2016లో తగిలిన గాయాలకు తోడు, పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకూ పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులుపట్టి లాగడంతో రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ అయ్యాయి. దీంతో ముంబైలో ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించగా.. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో శనివారం వైద్యులు మూడున్నర గంటల పాటు ఆపరేషన్ చేశారు.
Pawan Kalyan Surgery | రెండు నెలల వ్యవధిలో..
రెండు భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తే నొప్పి తీవ్రంగా ఉంటుందని వైద్యులు తెలిపారు. దీంతో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో ఆపరేషన్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: AP MBBS Seats | మరో 100 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్