RS Praveen Kumar | సీఎం వెంటనే రాజీనామా చేయాలి : ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

పోక్సో కేసు నిందితుడు ఆరుగురిని హత్య చేస్తే పోలీసులు ఏం చేశారని ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ ప్రశ్నించారు. సీఎం రేవంత్​రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: RS Praveen Kumar | రంగారెడ్డి జిల్లా (Ranga Reddy District) షాబాద్​ మండలం దైవాలగూడలో పోక్సో కేసులో నిందితుడు ఆరుగురిని హత్య చేసిన విషయం తెలిసిందే. బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న బీఆర్​ఎస్​ నాయకులు సబితా ఇంద్రారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్​ చేశారు.

శంకర్​పల్లి వద్ద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. పట్లోళ్ల కార్తీక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. స్టేషన్​లో ఆర్​ఎస్​ ప్రవీణ్​ కుమార్​ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హోం మంత్రిగా ఉన్న సీఎం రేవంత్​రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు.

RS Praveen Kumar | నిందితుడిని అరెస్ట్​ చేయాలి

RS Praveen Kumar

ప్రభుత్వం తమను అరెస్ట్ చేయకుండా నిందితుడిని అరెస్ట్ చేయాలని ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​ అన్నారు. ఆరుగురిని పాశవికంగా హత్య చేసిన నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడన్నారు. సభలతో ప్రజాధనం వృథా చేస్తున్న సీఎం రేవంత్​రెడ్డి హోంశాఖపై దృష్టి పెట్టాలని సూచించారు. రాజ్​కుమార్​ ఆరుగురిని చంపి పరారు అయ్యాడన్నారు. నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడన్నారు. గతంలో బండి భగీరథ్​ను సైతం పోలీసులు పోక్సో కేసులో అరెస్ట్​ చేయలేకపోయారని విమర్శించారు. రేవంత్​రెడ్డి హోంశాఖ మంత్రిగా విఫలం అయ్యారని విమర్శించారు. పేదలకు రక్షణ లేదు తాము గొడవ చేయడానికి వెళ్లడం లేదని, బాధితులను పరామర్శించడానికి వెళ్తే అరెస్ట్ చేయడం సరికాదన్నారు. రాజ్​కుమార్​ పోక్సో కేసులో బెయిల్ తెచ్చుకొని, చంపుతా అని చెప్పి హత్య చేశాడన్నారు. నిందితుడిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. పోలీసులు సీఎం రేవంత్​రెడ్డి, ఆయన సోదరులను రక్షించడంలో బిజీగా ఉన్నారన్నారు. పేదల ప్రాణాలకు తెలంగాణలో రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి..: Rangareddy Murders | ఘోరం.. కక్షతో ఆరుగురి దారుణ హత్య.. బాధితులు పొక్సో కేసు కుటుంబం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *