Rangareddy Murders | ఘోరం.. కక్షతో ఆరుగురి దారుణ హత్య.. బాధితులు పొక్సో కేసు కుటుంబం!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Rangareddy Murders | రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. పోక్సో POCSO కేసు నమోదు చేశారన్న కక్షతో ఓ వ్యక్తి ఆరుగురిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Rangareddy Murders | విచక్షణారహితంగా దాడి..

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. షాబాద్ మండలం దైవాలగూడ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ (28) అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో అతని భార్య, ఇద్దరు చిన్నారులు, పొక్సో కేసులో బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, డీసీపీ యోగేశ్ గౌతమ్ ఇతర పోలీసు అధికారులతో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Ganjani Mafia Hyderabad | గంజాయి కలకలం.. చిన్నారులే లక్ష్యంగా మత్తు వ్యాపారం.. ఈగల్‌ ఫోర్స్‌ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి!

ప్రాథమిక విచారణలో పొక్సో కేసు నేపథ్యంలో ఏర్పడిన కక్షతోనే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి కదలికలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

ఈ దారుణ ఘటనతో దైవాలగూడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *