Lorry Accident | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడు కార్లను ఢీకొట్టిన లారీ

shashi kiran Mottala

అక్షరటుడే, డిచ్​పల్లి: Lorry Accident | జాతీయ రహదారిపై (National Highway) లారీ బీభత్సం సృష్టించింది. వరుసగా ఏడు కార్లను ఢీకొట్టింది. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ (Indalwai Police Station) పరిధిలోని చంద్రాయన్​పల్లి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రహదారిపై ఈ ఘటను చూసిన స్థానికులు, ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.

Lorry Accident | కార్లు ధ్వంసం

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ (Hyderabad) వైపు నుంచి నిజామాబాద్ (Nizamabad) వస్తున్న ఓ లారీ చంద్రాయన్​పల్లి (Chandrayanpally) వద్ద ఆకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో ఆ లారీ వెనక ఉన్న సుమారు ఏడు కార్లు కూడా స్లో అయ్యాయి. అయితే ఈ కార్ల వెనక ఉన్న ఎరువుల లారీ మాత్రం వేగాన్ని అదుపు చేయలేక ఈ ఏడు కార్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్లు సైతం ఒకదానికొకటి ఢీకొని కొంతదూరం వరకు నెట్టుకెళ్లాయి. ఈ ఘటనలో పలు కార్లు పూర్తిగా ధ్వంసం కాగా అందులో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు స్పందించి 108కు సమాచారం ఇవ్వగా స్పందించిన వారు క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి (Nizamabad GGH) తరలించారు. కార్లలో ఉన్నవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఇందల్వాయి ఎస్సై సందీప్ తెలిపారు.

siddu

ఇది కూడా చదవండి: AIADMK MLAs Resign|తమిళనాడులో పొలిటికల్ సంచలనం.. ముగ్గురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామా

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *