అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Scanning Centre Fraud | స్కానింగ్ సెంటర్ యజమానిని మోసం చేసిన ఉద్యోగులు రూ.లక్షల్లో లూటీ చేశారు. ఈ ఘటన నిజామాబాద్(Nizamabad) నగరంలో చోటు చేసుకోగా.. వన్ టౌన్ పోలీసులు(Nizamabad Police) కేసు నమోదు చేశారు. ఎస్‌హెచ్‌వో రఘుపతి వివరాలు వెల్లడించారు.
Scanning Centre Fraud | రూ.70 లక్షలు మాయం
జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కానింగ్ కేంద్రంలో(Scanning Centre) ఇద్దరు ఉద్యోగులు గుండారం సత్యనారాయణ, మీనా కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు అయితే వారు నకిలీ నగదు రసీదులు తయారు చేసి, సంస్థ యాజమాన్యాన్ని మోసం చేసి రూ.70 లక్షలకు కాజేశారు. 2009నుం ఈ స్కానింగ్ సెంటర్ పనిచేస్తోంది. ఈ కేంద్రంలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న గుండారం సత్యనారాయణ, టి.మీనాలు కలిసి పథకం ప్రకారం సంస్థను మోసం చేశారు. రోగులకు ఇచ్చే అసలు నగదు రసీదుల్లో కార్బన్ పేపరు తొలగించి, అనంతరం అదే బిల్లు నంబర్ పరీక్షల వివరాల మొత్తాలను తక్కువగా చూపిస్తూ నకిలీ రికార్డులు తయారు చేశారు. రోగులకు అసలు మొత్తంతో కూడిన రసీదు ఇచ్చిన తర్వాత, కార్యాలయ రికార్డుల్లో మాత్రం పరీక్షల వివరాలు, ఫీజులను మార్చి నమోదు చేయడం ద్వారా రోజువారీ నగదును దుర్వినియోగం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Scanning Centre Fraud | ఆరేళ్లుగా స్కానింగ్ సెంటర్లో అక్రమాలు..
ఈ విధానం సుమారు ఆరేళ్లుగా కొనసాగిందని, ఈ కాలంలో రూ.70 లక్షలకు పైగా సంస్థకు నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ అక్రమాల గురించి ఇతర ఉద్యోగులు వెల్లడించకుండా వారిని బెదిరించడం, కొన్ని ఆధారాలను మాయం చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు సమాచారం సేకరించారు. ఇందుకు సంబంధించి 2025 జనవరి నుంచి జూలై వరకు ఉన్న కొన్ని నగదు రసీదుల ప్రతులను పోలీసులకు సమర్పించినట్లు ఫిర్యాదులో వివరించారన్నారు. ఈ సందర్భంగా సెంటర్లో పనిచేసిన ఇద్దరు ఉద్యోగులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. అక్రమంగా యజమానికి టోకరా వేసిన డబ్బులతో గుండారం సత్యనారాయణ తన భార్య పేరిట భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు విచారణలో వెళ్లడైందన్నారు. ఇందులో భాగంగా గుండారం సత్యనారాయణను అరెస్ట్ చేశామని.. మరో ఇద్దరు మహిళలు పరారీలో ఉన్నట్లు తెలిపారు.