Padma Awards 2026 | పద్మ పురస్కారాల ప్రదానోత్సవం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Padma Awards 2026 | రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ‘పద్మ పురస్కారాలు 2026’ను ప్రదానం చేశారు. సినిమా, సంగీతం, రంగస్థలం, ప్రజా సేవ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పురస్కారాలను అందుకున్నారు.

సినీ నటులు మమ్ముట్టి, ఆర్.మాధవన్, ప్రసేన్‌జిత్ ఛటర్జీ తదితరులు అవార్డులు ( Padma Awards 2026) అందుకున్నారు. అలాగే ధర్మేంద్ర, సతీష్ షా, పీయూష్ పాండేలకు మరణానంతరం పురస్కారాలు దక్కాయి. భారత మహిళా క్రికెట్​ జట్టు కెప్టెన్​​ హర్మన్‌ప్రీత్ కౌర్ ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రముఖ బెంగాలీ సూపర్‌స్టార్ ప్రొసెన్‌జిత్ ఛటర్జీకి పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు హాజరయ్యారు.

president

Padma Awards 2026 | సేవలకు గుర్తింపు

వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి గతంలోనే కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. తాజాగా రాష్ట్రపది వాటిని ప్రదానం చేశారు. నటుడు ధర్మేంద్రకు మరణానంతరం పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేయగా, ఆయన సతీమణి హేమా మాలిని ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వయోలిన్ విద్వాంసుడు ఎన్. రాజంకు పద్మవిభూషణ్ పురస్కారం లభించింది.

మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారికి, బ్యాంకర్ ఉదయ్ కోటక్‌కు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. మాజీ యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ సాహిత్యం, విద్యారంగంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. భారత రక్షణ ఉత్పాదక వ్యవస్థకు చేసిన సేవలకు గాను, సోలార్ గ్రూప్ ఛైర్మన్ సత్యనారాయణ నువాల్ పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

దీనిని కూడా చదవండి : Global Debt Crisis | అందరూ అప్పుల అప్పారావులే.. డెట్ లోనూ పెద్దన్నే ముందు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *