Wayanad Landslide | వయనాడ్‌లో భారీ వర్షాలు.. విరిగిపడ్డ కొండ చరియలు

కేరళలోని వయనాడ్​లో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉన్నారనే సమాచారంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Wayanad Landslide | కేరళ (Kerala)లోని వయనాడ్​లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షాలతో మంగళవారం వయనాడ్ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉన్నారనే సమాచారంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

మలప్పురం, వయనాడ్ జిల్లాలను కలిపే అనక్కొంపోయిల్-మెప్పాడి టన్నెల్ రోడ్డు ప్రాజెక్ట్ పనులు జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోని కల్లాడి వద్ద ఉన్న మీనాక్షి వంతెన దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడ నిర్మాణ కార్మికులు ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక, రక్షణ శాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Wayanad Landslide | 265మి.మీ. వర్షపాతం

వయనాడ్​లో 24 గంటల్లో 265 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయని భావిస్తున్నారు. ఈ ఘటనలో టన్నెల్ ప్రాజెక్ట్ కార్మికులను తరలించేందుకు ఉపయోగించే కొన్ని వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రాణనష్టంపై ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. సమీపంలో కొన్ని ఇళ్లు, హోమ్‌స్టేలు ఉన్నప్పటికీ వాటికి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది.

Wayanad Landslide | సీఎం అత్యవసర సమావేశం

Wayanad Landslide

వయనాడ్ కొండచరియల ఘటన నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి టి. సిద్ధిక్‌తో అత్యవసర సమావేశం నిర్వహించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక, పునరావాస చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ మంత్రి అనిల్ కుమార్, వయనాడ్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి సిద్ధిక్‌లను వెంటనే జిల్లాకు వెళ్లి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించాలన్నారు.

ఇది కూడా చదవండి..: Ahmedabad Blasts Verdict | అహ్మదాబాద్​ పేలుళ్ల కేసుల్లో సంచలన తీర్పు.. 38 మందికి ఉరిశిక్ష

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *