అక్షరటుడే వెబ్‌డెస్క్: Modi Indonesia Award | ఇండోనేషియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశం అత్యున్నత గౌరవాన్ని అందించింది. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో చేతుల మీదుగా ప్రధాని మోదీ ‘బింటాంగ్ ఆదిపూర్ణ రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేసియా’ పురస్కారాన్ని అందుకున్నారు. భారత్-ఇండోనేషియా మధ్య ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేయడంలో ప్రధాని మోదీ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు.
Modi Indonesia Award | భారత ప్రజల గౌరవం..
జాకార్తాలోని అధ్యక్ష భవనం ‘ఇస్తానా మెర్డెకా’లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ అవార్డు తనకు మాత్రమే కాకుండా, భారత ప్రజలందరికీ లభించిన గౌరవమని పేర్కొన్నారు. ఇండోనేసియా దేశాభివృద్ధికి, సార్వభౌమత్వానికి కృషి చేసిన ప్రముఖులకు 1959 నుండి ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేస్తున్నారు.
Modi Indonesia Award | రక్షణ, ఆర్థిక రంగాల్లో ..
ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య రక్షణ , ఆర్థిక సహకారానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భారత్ తయారు చేసిన ‘అస్త్ర’ (Astra) ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు ఇండోనేసియా ఆసక్తి చూపింది. అలాగే, బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను మరింత విస్తరించేందుకు భారత్ సహకారం అందించనుంది. వ్యూహాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న ‘సబాంగ్ ఓడరేవు’ (Sabang port)ను భారత్-ఇండోనేసియా దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి. భారత ఎన్నికల నిర్వహణ విధానాన్ని ఇండోనేసియా ప్రశంసించింది. తమ దేశంలో ఎన్నికల కోసం భారత తరహా ఈవీఎంల (EVMs)ను అభివృద్ధి చేయడంలో భారత్ మద్దతు కోరింది.
Modi Indonesia Award | అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘బింటాంగ్ ఆదిపూర్ణ’..
ఇండోనేసియా దేశ ఐక్యత, సమగ్రత , అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను పెంచిన వారికి మాత్రమే ఇచ్చే అత్యున్నత పతకం ఇది. అంతర్జాతీయ వేదికలపై ప్రధాని మోదీకి ఇలాంటి అత్యున్నత పౌర పురస్కారాలు లభించడం ఇది మరోసారి నిరూపించింది. ఈ పర్యటన ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని విదేశాంగ శాఖ పేర్కొంది.
भारत के बढ़ते वैश्विक प्रभाव और मा• प्रधानमंत्री श्री @narendramodi जी के दूरदर्शी नेतृत्व को एक और ऐतिहासिक अंतरराष्ट्रीय सम्मान प्राप्त हुआ है।
इंडोनेशिया ने मा• प्रधानमंत्री जी को अपने सर्वोच्च नागरिक सम्मान से अलंकृत किया है। यह सम्मान 140 करोड़ भारतीयों के गौरव, भारत की… pic.twitter.com/Zw20ohUANV
— Swatantra Dev Singh (@swatantrabjp) July 7, 2026
ఇది కూడా చదవండి: Komidi Narsimha Reddy | భువనగిరి మాజీ ఎమ్మెల్యే మృతి