Pawan Kalyan Health | ముంబయిలో పవన్‌ కల్యాణ్‌కు భుజం ఆపరేషన్.. పరామర్శించిన సీఎం చంద్రబాబు

ముంబయిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Pawan Kalyan Health | ముంబయిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అక్కడ కోకిలాబెన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్‌ను కలిసి, ఆయన ఆరోగ్య వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పవన్‌ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఈ సందర్భంగా సీఎం ఆకాంక్షించారు.

Pawan Kalyan Health | పవన్‌కు భుజం శస్త్రచికిత్స..

పవన్‌ కల్యాణ్‌ కుడి భుజానికి సంబంధించి డాక్టర్ దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం శనివారం విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించింది. రొటేటర్‌ కఫ్‌ గాయంతో పాటు భుజానికి ‘అవల్షన్‌ ఫ్రాక్చర్‌’ ఉండటంతో ఈ ఆపరేషన్ అవసరమైందని వైద్యులు తెలిపారు. భవిష్యత్తులో ఎడమ భుజానికి కూడా మరో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

pawan.1

Pawan Kalyan Health | మజిల్‌ టేర్స్‌ ఉన్నట్లు..

గత ఏప్రిల్‌లో ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్న సమయంలోనే, వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో పవన్ భుజాలకు తీవ్రస్థాయిలో కండరాల గాయాలు (మజిల్‌ టేర్స్‌) ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల త్వరగా ఆపరేషన్ చేయించుకోవాలని అప్పట్లోనే వైద్యులు సూచించడంతో, పవన్‌ కల్యాణ్ ముంబయి వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు.

 

ఇది కూడా చదవండి: Vijayawada Bus Fire | విజయవాడలో అగ్ని ప్రమాదం.. ఏడు బస్సులు దగ్ధం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *