అక్షరటుడే, వెబ్డెస్క్: AP Local Body Elections | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన గడువులోపు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఎస్ఈసీ ఇప్పటికే సిద్ధమైంది. అయితే నోటిఫికేషన్ విడుదలలోపు ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయితే ఆ జాబితా తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఒకవేళ ‘సర్’ ప్రక్రియ పూర్తికాకపోతే పాత జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
AP Local Body Elections | బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేత..
ఇక స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను దేశ అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. ఈ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. 34 శాతం కోటా కారణంగా రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని దాటుతున్నాయని.. రాష్ట్ర సర్కారు జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు ఇటీవల కొట్టేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం తలుపుతట్టింది. విచారణ చేపట్టిన ధర్మాసనం హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
ఇది కూడా చదవండి..: AP AI GST Model | ఏపీ ఏఐ ఆధారిత జీఎస్టీ విధానానికి జాతీయ గుర్తింపు