YSRCP Assembly Boycott | జగన్‌కు అసలు రాజకీయాలు అవసరమా?: సీఎం చంద్రబాబు

శాసనసభ సమావేశాలను వైఎస్సార్‌సీపీ బహిష్కరించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: YSRCP Assembly Boycott | శాసనసభ సమావేశాలను వైఎస్సార్‌సీపీ బహిష్కరించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ( Chandrababu Naidu )  నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతిలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయం లాంటి అసెంబ్లీని ఒక పార్టీ పూర్తిగా బహిష్కరించడం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ చూడలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని చులకన చేస్తున్న జగన్‌కు అసలు రాజకీయాలు అవసరమా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోందని వ్యాఖ్యానించారు.

YSRCP Assembly Boycott | ఎలాంటి ప్రయోజనం ఉండదు..

ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తేనే వాటికి సరైన విలువ, గుర్తింపు ఉంటాయని, సభకు రాకుండా బయట కూర్చుని మాట్లాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో 1978లో వెంకయ్యనాయుడు, జైపాల్‌రెడ్డి ఇద్దరే సభలో గట్టిగా మాట్లాడారని, 1989-94 మధ్య ఎన్టీఆర్ కొన్ని రోజులు రాకపోయినా తామంతా పార్టీ తరఫున పోరాడామని గుర్తుచేశారు. అలాగే 2019-2024 మధ్య తాను సవాల్ చేసి బయటకు వచ్చినప్పటికీ, తమ ఎమ్మెల్యేలు చివరి వరకు సభలోనే ఉండి ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించారని తెలిపారు.

YSRCP Assembly Boycott | తప్పుడు ప్రచారాలు..

గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్‌-1 అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటున్నారని, డీఎస్సీ అంశంపై బురదజల్లుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం కోత పెట్టిన బీసీ రిజర్వేషన్లను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పునరుద్ధరించిందని, ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తుంటే జగన్ తప్పుడు ప్రచారాలు చేయడం హాస్యాస్పదమని చంద్రబాబు మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: Principal Murder Case | ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *