Bharat Summit | రాహుల్‌ను పిలిస్తే తప్పేంటి?.. భారత్ సమ్మిట్ విమర్శలపై శ్రీధర్ బాబు కౌంటర్

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వేదికగా నిర్వహించ తలపెట్టిన 'భారత్ సమ్మిట్' వివాదానికి కేంద్రబిందువుగా మారింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bharat Summit | తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వేదికగా నిర్వహించ తలపెట్టిన ‘భారత్ సమ్మిట్’ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు, సాంకేతికత, ప్రగతిశీల భాగస్వామ్యాలను ఆకర్షించేందుకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ( Rahul Gandhi )ఆహ్వానించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. భారత్ సమ్మిట్‌కు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తే తప్పేంటని గట్టిగా ప్రశ్నించారు.

Bharat Summit | రాజకీయం చేయడం మా ఉద్దేశం కాదు..

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన శ్రీధర్ బాబు.. దేశంలోని ప్రాథమిక సమస్యల మూలాలపై చర్చించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. సమ్మిట్‌ను రాజకీయం చేయడం తమ ఉద్దేశం కాదని తేల్చి చెప్పారు. సాంకేతికత, ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లపై మాట్లాడేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రగతిశీల భావాలు కలిగిన పార్టీ అని, కాంగ్రెస్ – బీజేపీ సిద్ధాంతాలు వేర్వేరని పేర్కొంటూ.. ప్రగతిశీల భావాలున్న అన్ని పార్టీలు, వర్గాలను ఈ సదస్సుకు ఆహ్వానించామని వివరించారు.

Bharat Summit | 70 దేశాల ప్రతినిధులు..

దాదాపు 70 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యే ఈ భారత్ సమ్మిట్‌ను ఒక అంతర్జాతీయ ఆర్థిక వేదికగా ఉపయోగించుకుంటామని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులతో పాటు నేటి యువత, అంటే ‘జెన్ జీ’ (Gen Z) లేవనెత్తిన ప్రధాన అంశాలపైనా ఈ సదస్సులో లోతుగా చర్చిస్తామన్నారు.

Bharat Summit | నీట్ అంశాల ప్రస్తావన..

సదస్సులో ఎస్ఐఆర్ (SIR) పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రస్తావిస్తామని, దానికి సంబంధించిన సమస్యల పరిష్కార మార్గాలపై చర్చిస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు. అలాగే ‘నీట్’ (NEET) పరీక్షల వివాదంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గళమెత్తి పోరాడటం వల్లే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి:  SBI ATM Robbery Attempt | మళ్లీ పెట్రేగిన దొంగలు.. ఎస్​బీఐ ఏటీఎం లూటీకి విఫలయత్నం

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *