అక్షరటుడే, వెబ్‌డెస్క్: BITS Pilani WILP | ఉన్నత విద్యారంగంలో చరిత్రాత్మక మైలురాయిగా బిట్స్ పిలానీ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ (WILP) కాన్వొకేషన్ 2026 ఘనంగా జరిగింది. 30 ప్రత్యేక విభాగాలలో మొత్తం 15,153 మంది పని చేసే నిపుణులకు (working professionals) ఈ వేడుకలో డిగ్రీలను ప్రదానం చేశారు.
BITS Pilani WILP | పట్టభద్రుల వేడుక
బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్‌లో జరిగిన ఈ స్నాతకోత్సవంలో గత ఏడాదితో పోలిస్తే గ్రాడ్యుయేట్ల సంఖ్య రెట్టింపు అయింది. హైదరాబాద్ క్యాంపస్‌తో పాటు కస్టమ్ మెటావర్స్ స్టేజ్ ద్వారా ఈ పట్టభద్రుల వేడుకను సరికొత్త ‘ఫైజిటల్’ (phygital) విధానంలో నిర్వహించారు.
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి దోహదపడే సాంకేతిక, డిజిటల్ రంగాలకు చెందిన వారు 46%, ఇంజనీరింగ్, తయారీ, మౌలిక వసతుల రంగానికి చెందిన వారు 35% మంది ఈ గ్రాడ్యుయేటింగ్ కోహార్ట్‌లో ఉన్నారు. అలాగే ఇందులో 2,000 మందికి పైగా మహిళా నిపుణులు, 167 మంది వైద్యులు, 60 మంది రక్షణ సిబ్బంది, మరియు 15 దేశాలకు చెందిన 80 మందికి పైగా అంతర్జాతీయ అభ్యాసకులు భాగస్వామ్యం కావడం విశేషం.
డిక్సన్ టెక్నాలజీస్ వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ బి. లాల్ ముఖ్య అతిథిగా విచ్చేయగా.. బిట్స్ పిలానీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.రామగోపాల్ రావు, డైరెక్టర్-ఇన్-ఛార్జ్ ప్రొఫెసర్ ఎస్. గురునారాయణన్ ఈ చారిత్రాత్మక వేడుకను ప్రారంభించారు.
BITS Pilani WILP | నిరంతర అభ్యాసనం ద్వారానే..
బిట్స్ పిలానీ ఛాన్సలర్ డాక్టర్ కుమార మంగళం బిర్లా మాట్లాడుతూ.. నిరంతర అభ్యాసనం ద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థ మరియు సాంకేతిక సార్వభౌమత్వం బలోపేతమవుతాయని పేర్కొన్నారు. ఉద్యోగంలో కొనసాగుతూనే ఉన్నత విద్యను అభ్యసించడం నేటి ఉపాధి రంగంలో నూతన ప్రమాణంగా మారిందని, ఇది దేశ ఆర్థిక స్థితిస్థాపకతను చాటుతోందని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఈ విద్యాసంస్థలో 51,000 మందికి పైగా లెర్నర్స్ ఎన్ రోల్ అయి ఉండగా, ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలలో 1.5 లక్షల మందికి పైగా అలమ్నీ నెట్వర్క్ కలిగి ఉంది.
ఇది కూడా చదవండి..: Skyways Air Services IPO | రేపటి నుంచి అందుబాటులోకి లాజిస్టిక్ కంపెనీ ఐపీవో..