India vs Sri Lanka Test | తొలి టెస్టులో భారత్ ఘన విజయం

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 206 పరుగులకే ఆలౌటైంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: India vs Sri Lanka Test | శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 206 పరుగులకే ఆలౌటైంది. దీంతో 165 పరుగుల తేడాతో భారత్​ గెలిచింది.

తొలి ఇన్నింగ్స్​లో భారత్​ 462 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంకను 284 పరుగులకు కట్టడి చేసింది. రెండో ఇన్నింగ్స్​లో భారత్ 193 పరుగులకే ఆలౌట్​ అయింది. దీంతో శ్రీలంక 372 పరుగుల టార్గెట్​తో బరిలోకి దిగింది. ధనుంజయ డిసెల్వ (59), సోనాల్​ దినుష (84) రాణించడంతో 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 142 పరుగుల వరకు తర్వాత వికెట్ కోల్పోలేదు. వికెట్ కోసం భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. డి సెల్వను రవీంద్ర జడేజా ఔట్ చేయడంతో మిగతా వికెట్లు సైతం టపటప పడిపోయాయి. దీంతో భారత్​ (India) విజయం సాధించగా.. రెండు టెస్టుల​ సిరిస్​లో 1–0లీడ్​లోకి వెళ్లింది.

India vs Sri Lanka Test | రాణించిన మానవ్​ సుతార్​

భారత బౌలర్ మానవ్​ సుతార్​ రాణించాడు. తొలి ఇన్నింగ్స్​లో 4, రెండో ఇన్నింగ్స్​లో ఆరు వికెట్లు తీశాడు. మొత్తం 10 వికెట్లు తీయడంతో పాటు తొలి ఇన్నింగ్స్​లో 24 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్​లో ప్రసిద్​ కృష్ణ 2, జడేజా, సిరాజ్​ తలో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్​లో పడిక్కల్​ 167, రాహుల్ 82, ద్రువ్​ జురేల్​ 51 పరుగులతో రాణించగా.. సెకండ్​ ఇన్నింగ్స్​లో పంత్​ 66, పడిక్కల్ 44 పరుగులు చేశారు. కెప్టెన్​ శుభ్​మన్​ గిల్​ రెండు ఇన్నింగ్స్​ల్లో విఫలం అయ్యాడు.

ఇది కూడా చదవండి..: Kavya Maran Wedding | కావ్యా మారన్–అనిరుధ్ పెళ్లి? నవంబర్ 10న గ్రీస్‌లో అంటూ ప్రచారం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *