Principal Murder Case | ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Principal Murder Case | నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పాఠాలు చెప్పిన గురువును, డబ్బుల కోసం ఇద్దరు పదో తరగతి విద్యార్థులు దారుణంగా కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తేల్చారు. పెరిగిపోతున్న గంజాయి సంస్కృతి ఎంతటి దారుణాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Principal Murder Case | జల్సాల కోసమే..

పోలీసుల వివరాల ప్రకారం.. హత్యకు పాల్పడిన ఇద్దరు మైనర్ విద్యార్థులు గంజాయికి బానిసయ్యారు. జల్సాలు చేయడానికి డబ్బులు సరిపోకపోవడంతో ప్రిన్సిపల్ రూపారెడ్డి ఇంట్లో దొంగతనం చేయాలని ప్లాన్ చేశారు. ఈ నెల 11న సాయంత్రం ప్రిన్సిపల్ ఇంటికి రాకముందే వారు గోడ దూరి లోపలికి ప్రవేశించారు. ఆమె తాళం తీసి లోపలికి వెళ్లిన తర్వాత వంటగదిలో నక్కి, ఆమె బెడ్‌రూమ్‌లోకి వెళ్లగానే వెనుక నుంచి కత్తితో ఏకంగా 27 సార్లు పొడిచి హత్య చేశారు.

Principal Murder Case | రూ. 2 లక్షలతో జల్సాలు..

హత్య అనంతరం రూపారెడ్డి హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న రూ. 2 లక్షల నగదును తీసుకుని నిందితులు పరారయ్యారు. పోలీసులకు, సీసీటీవీలకు చిక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఆ డబ్బుతో హైదరాబాద్‌కు వెళ్లి విచ్చలవిడిగా జల్సాలు చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించిన పోలీసులు ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేశారు. చదువు నేర్పిన గురువును కడతేర్చిన ఈ ఘటన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

ఇది  కూడా చదవండి: Yashoda Robotic Surgery | ‘యశోద’లో విజయవంతంగా రోబోటిక్ సర్జరీలు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *