ED Raids Azam Khan | ఎస్పీ లీడర్​ ఆజంఖాన్​ యూనివర్సిటీపై ఈడీ దాడులు

సమాజ్​వాది పార్టీ నాయకుడు ఆజం ఖాన్​కు చెందిన ట్రస్ట్​, యూనివర్సిటీపై ఈడీ దాడులు చేసింది.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ED Raids Azam Khan | సమాజ్​వాది పార్టీ నాయకుడు ఆజం ఖాన్​కు చెందిన ట్రస్ట్​, యూనివర్సిటీపై ఈడీ దాడులు చేసింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం పది ప్రాంతాలలో సోదాలు నిర్వహించింది.

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని రాంపూర్, సహారన్‌పూర్, ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో ఈడీ అధికారులు దాడులు చేశారు. ఆజం ఖాన్‌కు చెందిన మౌలానా మహమ్మద్ అలీ జౌహర్ ట్రస్ట్, మహమ్మద్ అలీ జౌహర్ యూనివర్సిటీ ప్రాంగణాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టు నిధులను ప్రైవేట్ కాంట్రాక్టర్ల ద్వారా మళ్లించడం, అనంతరం వాటిని యూనివర్సిటీ, ట్రస్ట్ ఆస్తుల సృష్టి వంటి పనులకు వినియోగించడం వంటి ఆరోపణలు ఆయనపై నమోదు అయ్యాయి.

ED Raids Azam Khan | భారీ విరాళాలు

కొంతమంది కాంట్రాక్టర్లకు, ట్రస్ట్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. ప్రభుత్వ కాంట్రాక్టుల ద్వారా లబ్ధి పొందిన కాంట్రాక్టర్లు భారీ విరాళాలు, నిర్మాణ పనుల రూపంలో నిధులను ట్రస్ట్, యూనివర్సిటీ వైపు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించడానికి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Madras High Court |  ఆలయాల్లో వివక్షకు తావులేదు : మద్రాస్​ హైకోర్టు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *