అక్షరటుడే, వెబ్డెస్క్: Madras High Court | ఆలయాల్లో కుల వివక్షకు తావు లేదని మద్రాస్ హైకోర్టు (Madras High Court) స్పష్టం చేసింది. కాంచీపురంలోని అరుల్మిగు దేవరాజ స్వామి ఆలయంలో బ్రాహ్మణేతర భక్తుల పట్ల వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
భక్తులపై వివక్ష చూపడానికి మతపరమైన సంప్రదాయాలను సాకుగా వాడకూడదని న్యాయమూర్తులు జి. జయచంద్రన్, ఇ. మనోహరన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. దేవుని దృష్టిలో జీవులందరూ సమానమే, ఆయన ఎటువంటి వివక్ష చూపరని కోర్టు తెలిపింది. దేవుడు సమస్త జీవుల పట్ల సమాన భావన కలిగి ఉంటాడని, ఎవరి పక్షానా పక్షపాతం చూపడని, ఎవరి పట్ల ద్వేషం కలిగి ఉండడని తెలిపే భగవద్గీత శ్లోకాన్ని ధర్మాసనం ప్రస్తావించింది.
Madras High Court | రెండు ద్వారాలు..
తిరుకచ్చి నంబి తిరుమలడియార్ సేవా సంఘం కార్యదర్శి మాధవన్ రామానుజ దాసన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆలయంలో రెండు ద్వారాలు ఉన్నాయని ఆయన తెలిపారు. బ్రాహ్మణ భక్తులను ప్రధాన ద్వారం గుండా అనుమతించగా, బ్రాహ్మణేతర భక్తులను పక్క ద్వారం గుండా వెళ్లాలని సూచించినట్లు ఆరోపించారు. తీర్థం, ప్రసాదం స్వీకరించే సమయంలో బ్రాహ్మణేతర భక్తులను సన్నిధి బయటే నిలబెట్టేవారన్నారు. హిందూ మత మరియు ధర్మాదాయ శాఖ ఈ ఆరోపణలను ఖండించింది. మతపరమైన కార్యక్రమాల సమయంలో భక్తులందరికీ సరిపోయేంత స్థలం ఆ ఉప-సన్నిధులలో లేదని వివరించింది.
ఇది కూడా చదవండి..: Dowry Murder Case | గేదె కోసం భార్య హత్య.. జీవిత ఖైదు విధించిన కోర్టు