అక్షరటుడే, కామారెడ్డి: Yashoda Robotic Surgery | యశోద ఆస్పత్రి సికింద్రాబాద్ బ్రాంచ్‌లో ఆర్థోకు సంబంధించి రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా కొనసాగుతున్నాయని ఆస్పత్రి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డా.విక్రమ్ వైరి తెలిపారు. బుధవారం ఆయన కామారెడ్డి పట్టణంలోని యశోద బ్రాంచ్ మెడికల్ క్లినిక్‌లో మీడియాతో మాట్లాడారు.
Yashoda Robotic Surgery | కామారెడ్డికి చెందిన..
కామారెడ్డి (Kamareddy)కి చెందిన పెంటయ్య మోకాలి గుజ్జు అరిగిపోయి నడవలేని స్థితిలో నాల్గో స్టేజ్‌లో యశోద ఆస్పత్రికి వచ్చారన్నారు. అతనికి పరీక్షలు నిర్వహించి రోబోటిక్ సర్జరీ అవసరమని చెప్పామన్నారు. సర్జరీ గురించి అతనికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించిన తర్వాత రోబోటిక్ ద్వారా సర్జరీ విజయవంతంగా నిర్వహించి మూడు రోజుల పాటు శిక్షణ ఇచ్చి ఇంటికి పంపించామని తెలిపారు. రోబోటిక్ సర్జరీ ద్వారా ఒక్కరోజులోనే ఇంటికి వెళ్లే అవకాశం ఉంటుందని, బ్లడ్ లాస్ ఉండదని, ఇంప్లాంట్స్ ఎక్కడ అమర్చేది తెలుస్తుందని, ఆపరేషన్ అయ్యాక ఆపరేషన్ చేశారన్న ఫీలింగ్ కూడా ఉండదన్నారు. ఈ సర్జరీ అనంతరం పేషంట్‌కు మానసిక ధైర్యం వస్తుందని పేర్కొన్నారు.
Yashoda Robotic Surgery | క్రిటికల్ సర్జరీలు సైతం
రోబోటిక్ ద్వారా జాయింట్స్ రీప్లేస్మెంట్ మాత్రమే కాకుండా క్రిటికల్ సర్జరీలు కూడా చేస్తామని డాక్టర్ తెలిపారు. కొన్నాళ్ల క్రితం కామారెడ్డికి చెందిన 22 ఏళ్ల కుర్రాడు రోడ్డు ప్రమాదంలో కాలికి గాయమై రక్తప్రసరణ ఆగిపోతే తమ వద్దకు వస్తే రోబోటిక్ ద్వారా సర్జరీ విజయవంతంగా నిర్వహించామన్నారు. ఇప్పటివరకు యశోద సికింద్రాబాద్ బ్రాంచ్‌లో రోబోటిక్ ద్వారా 10 వేలకు పైగా సర్జరీలు నిర్వహించామని తెలిపారు. తాను ప్రతి నెల 3వ బుధవారం కామారెడ్డి బ్రాంచ్‌కు వస్తానని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ సమావేశంలో మెడికల్ క్లినిక్ మేనేజర్ శ్రీనివాస్, బాధితుడు పెంటయ్య పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Additional Collector | నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా రాజా గౌడ్