Nizamabad Additional Collector | నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా రాజా గౌడ్

నిజామాబాద్‌ జిల్లా భౌగోళిక పరిస్థితులు, రెవెన్యూ వ్యవస్థపై ఆయనకు ఇప్పటికే అవగాహన ఉంది.

Naresh Chandan

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Additional Collector | నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా రాజా గౌడ్‌ బదిలీపై రానున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్‌ (లోకల్‌ బాడీస్‌)గా విధులు నిర్వహిస్తున్న రాజా గౌడ్‌ను నిజామాబాద్ అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా ప్రభుత్వం నియమించింది. త్వరలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

Nizamabad Additional Collector | గతంలో బోధన్​ ఆర్డీవోగా..

రాజా గౌడ్‌ గతంలో బోధన్‌ ఆర్డీవోగా పనిచేశారు. దీంతో నిజామాబాద్‌ జిల్లా భౌగోళిక పరిస్థితులు, రెవెన్యూ వ్యవస్థపై ఆయనకు ఇప్పటికే అవగాహన ఉంది. గతంలో జిల్లాలో పనిచేసిన అనుభవం ప్రస్తుత బాధ్యతల్లో ఉపయోగపడుతుందని అధికారులు, సిబ్బంది భావిస్తున్నారు.

రెవెన్యూ పరిపాలన, భూసంబంధిత అంశాలు, ప్రజల నుంచి వచ్చే సమస్యల పరిష్కారంలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *