అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aug 19 Market Analysis | ముడి చమురు ధరలలో అస్థిరత, ప్రపంచ బాండ్ల రాబడులలో భారీ పెరుగుదల పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ఒత్తిడిని పెంచుతోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.
గిఫ్ట్ నిఫ్టీ మాత్రం స్వల్ప లాభాలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్ గా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Aug 19 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
వరుసగా మూడవ సెషన్లోనూ వాల్‌స్ట్రీట్ నష్టాలను నమోదు చేసింది. గత సెషన్లో నాస్డాక్ 1.33 శాతం, ఎస్ అండ్ పీ 0.69 శాతం తగ్గగా.. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.08 శాతం నష్టంతో ఉంది.
Aug 19 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.07 శాతం లాభంతో, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.80 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.83 శాతం నష్టపోయాయి.
Aug 19 Horoscope | కష్టానికి తగిన ప్రతిఫలం.. ఈ రాశుల వారిని వెతుక్కుంటూ రానున్న అదృష్టం
Aug 19 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 5.27 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 2.71 శాతం, చైనాకు చెందిన షాంఘై 1.44 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.25 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.52 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.07 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.07 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు పాజిటివ్ గా ప్రారంభం కానున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్లో నికరంగా రూ. 1,651 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డీఐఐలు గత సెషన్లో నికరంగా రూ. 2,579 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 6 పైసలు బలహీనపడి 95.68 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.63 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.71 వద్ద ఉన్నాయి.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 91.86 డాలర్ల వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.99 నుంచి 0.93కి తగ్గింది.
- విక్స్ 0.55 శాతం పెరిగి 11.38 వద్ద ఉంది.