అక్షరటుడే, వెబ్డెస్క్ : Kanohar Electricals IPO | భారతదేశంలో ట్రాన్స్‌ఫార్మర్ల తయారీలో అగ్రగామి సంస్థలలో కనోహర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కంపెనీ ఒకటి. పవర్ ట్రాన్స్‌మిషన్, రైల్వేలు, రెన్యువబుల్ ఎనర్జీ, పవర్ డిస్ట్రిబ్యూషన్ వంటి వివిధ సెక్టార్ల కోసం ట్రాన్స్‌ఫాÛర్మర్స్‌ను తయారు చేస్తోంది. 100 ఎంవీఏ, 132 కేవీ స్కాట్ ట్రాన్స్‌ఫార్మర్ల తయారీకి భారతీయ రైల్వేల పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అయిన రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ధ్రువీకరించిన భారతదేశంలోని నాలుగు తయారీదారులలో ఒకటి.
Kanohar Electricals IPO | రెండు విభాగాలలో సేవలు..
ఈ సంస్థ రెండు ప్రధాన వ్యాపార విభాగాలలో పనిచేస్తోంది. ఒకటి ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ కాగా రెండవది ఇంజినీరింగ్, సేకరణ మరియు నిర్మాణం సేవలు(ఈపీసీ). ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో గల రిథాని మరియు గంగోల్‌లో రెండు తయారీ కేంద్రాలున్నాయి. గతేడాది సెప్టెంబర్ 30 నాటికి, ఈ కేంద్రాలు సంయుక్తంగా 19,200 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్లను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి.
Kanohar Electricals IPO | రూ. 1055.74 కోట్లు సమీకరించడం కోసం..
ఐపీవో (IPO) ద్వారా కంపెనీ మొత్తం రూ. 1055.74 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఫ్రెష్ ఇష్యూ కింద రూ. 2 ఫేస్ వాల్యూ కలిగిన 47,46,835 షేర్లను విక్రయించి రూ. 300 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద రూ. 2 ఫేస్ వాల్యూ కలిగిన 1,19,57,915 షేర్లను విక్రయించి రూ. 756 కోట్లు పొందనుంది. ఐపీవో ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవసరాల కోసం, అలాగే సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం కంపెనీ వినియోగించనుంది.
ప్రైస్ బ్యాండ్ : కంపెనీ ఒక్కో షేరు ధరను రూ. 601 నుంచి రూ. 632 లుగా నిర్ణయించింది. ఒక లాట్‌లో 23 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,536 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల వరకు బిడ్లు వేయొచ్చు.
కోటా : క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం వాటా కేటాయించారు.
జీఎంపీ : కంపెనీ షేర్లకు గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 198 గా ఉంది. ఈ ఐపీవో అలాట్ అయితే లిస్టింగ్ సమయంలో సుమారు 31 శాతం లాభాలు వచ్చే అవకాశాలున్నాయి.
ఐపీవో తేదీలు : సెప్టెంబర్ 08 సబ్ స్క్రిప్షన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 10 వరకు అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 11న రాత్రి షేర్స్ అలాట్‌మెంట్ స్టేటస్ తెలిసే అవకాశం ఉంది.
కంపెనీ షేర్లు సెప్టెంబర్ 16న స్టాక్ ఎక్స్ఛేంజీలు అయిన బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి.
ఇది కూడా చదవండి..: Glass Wall Systems IPO | మార్కెట్‌లోకి మరో చిన్న ఐపీవో.. జీఎంపీ ఎంతంటే?