అక్షరటుడే, వెబ్‌డెస్క్: SBI Q2 Results 2026 | దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సెక్టార్ బ్యాంక్ అయిన ఎస్బీఐ (SBI) 2026 -27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మంచి ఫలితాలను నమోదు చేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం వార్షిక ప్రాతిపదికన 14.3 శాతం పెరిగి రూ.23,038 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.20,160 కోట్లుగా ఉంది.
SBI Q2 Results 2026 | నికర వడ్డీ ఆదాయం..
- బ్యాంకు నికర వడ్డీ ఆదాయం (ఆర్జించిన వడ్డీకి మరియు చెల్లించిన వడ్డీకి మధ్య వ్యత్యాసం) సుమారు 15 శాతం వృద్ధితో రూ.42,847 కోట్ల నుంచి రూ.49,143 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయంలో మంచి వృద్ధితోపాటు వివిధ సంస్థల్లోని వాటాల విక్రయం ద్వారా లభించిన అసాధారణ లాభాలు (ఎక్సెప్షనల్ గెయిన్స్ ) త్రైమాసిక ఆదాయాన్ని మరింత పెంచాయి.
- గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.4,593 కోట్లుగా ఉన్న అసాధారణ లాభాలు ఈసారి రూ. 7,288 కోట్లకు పెరిగాయి.
- ఫీజు ఆధారిత ఆదాయం, ట్రెజరీ ఆదాయం, ఇతర వడ్డీయేతర ఆదాయాలను కలిగి ఉన్న ఇతర ఆదాయం ఏడాది ప్రాతిపదికన 24 శాతం తగ్గి రూ.11,777 కోట్లుగా నమోదయ్యింది. ఇది గతేడాది రూ.15,463 కోట్లుగా ఉంది.
SBI Q2 Results 2026 | తగ్గిన నిరర్థక ఆస్తులు..
బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చితే 1.73 శాతం నుంచి 1.39 శాతానికి తగ్గాయి. నికరంగా మొండి బాకీలు సైతం 0.42 శాతం నుంచి 0.36 శాతానికి పడిపోయాయి.
ఇది కూడా చదవండి..: Stock Market Rally | జోరుమీదున్న బుల్.. భారీ లాభాలతో ముగిసిన ప్రధాన సూచీలు