అక్షరటుడే, వెబ్‌డెస్క్: Oct 26 Market Analysis | పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు చమురు సరఫరా ఆందోళనలను పెంచుతున్నాయి. ముడి చమురు ధరలు గత వారం చివరలో ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరిన తర్వాత కాస్త శాంతించినా.. సౌదీ అరేబియాపై హౌతీల దాడులు కొనసాగుతుండడంతో బ్యారెల్ ధర 114 డాలర్లపైనే ట్రేడ్ అవుతోంది.
గత సెషన్లో వాల్‌స్ట్రీట్ (Wall street) నష్టాలతో ముగియగా.. సోమవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు ఎక్కువగా నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్‌గా ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
Oct 26 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
పెట్టుబడిదారులు రాబోయే కార్పొరేట్ ఆర్థిక ఫలితాలతోపాటు త్వరలో నిర్వహించే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధాన సమావేశంపై దృష్టి సారించడంతో వాల్ స్ట్రీట్ ప్రధాన సూచీలు గత సెషన్లో నష్టాలతో ముగిశాయి. గత సెషన్లో నాస్డాక్ 0.21 శాతం, ఎస్ అండ్ పీ 0.52 శాతం నష్టపోగా.. సోమవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.23 శాతం లాభంతో ఉంది.
Oct 26 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.75 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.37 శాతం నష్టపోగా.. యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ ఫ్లాట్ గా ముగిసింది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
Oct 26 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు నష్టాలతో ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.41 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.63 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.56శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.13 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.01 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. తైవాన్ మార్కెట్ కు సెలవు. గిఫ్ట్ నిఫ్టీ 0.02 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు నెగెటివ్ గా ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గత సెషన్లో నికరంగా రూ. 887 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- డీఐఐలు వరుసగా నాలుగో సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 3,236 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు బలహీనపడి 94.94 వద్ద ఉంది.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 114.84 డాలర్ల వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 101.61 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.97 శాతం వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.88 నుంచి 0.81 కు తగ్గింది.
- విక్స్ 6.96 శాతం పెరిగి 16.86 వద్ద ఉంది.