Stock Market Rally | జోరుమీదున్న బుల్.. భారీ లాభాలతో ముగిసిన ప్రధాన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం సైతం భారీ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 1,225 పాయింట్లు, నిఫ్టీ 370 పాయింట్లు లాభపడ్డాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Rally | దేశీయ స్టాక్ మార్కెట్‌లో బుల్స్ జోరుమీదున్నాయి. దీంతో వరుసగా నాలుగో సెషన్‌లోనూ ప్రధాన సూచీలు లాభాలతో ముగిశాయి. విదేశీ సంస్థాగత మదుపరులు నెట్ బయ్యర్లుగా కొనసాగుతుండడం, ముడిచమురు ధరలు దిగివస్తుండడంతోపాటు కంపెనీల బలమైన త్రైమాసిక ఫలితాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయి. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, దేశీయ మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి స్టాక్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) రద్దు చేయాలని సెబీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం సైతం మార్కెట్ పరుగులు తీయడానికి కారణం.

Stock Market Rally | లాభాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) మంగళవారం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 596 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమై మొదట్లో కాస్త దిద్దుబాటుకు గురై 255 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి పుంజుకుని 535 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 142 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా అక్కడినుంచి 100 పాయింట్లు తగ్గింది. ఇంట్రాడే కనిష్టాలనుంచి 193 పాయింట్లు పైకి ఎగబాకింది. చివరికి సెన్సెక్స్ 1,225 పాయింట్ల లాభంతో 76,917 వద్ద, నిఫ్టీ 370 పాయింట్ల లాభంతో 23,810 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,510 కంపెనీలు లాభపడగా 1,895 స్టాక్స్ నష్టపోయాయి. 201 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 100 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 109 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 25 కంపెనీలు లాభాలతో, 5 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. హెచ్యూఎల్ 4.16 శాతం, ఎయిర్‌టెల్ 4 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.62 శాతం, ఆసియన్ పెయింట్స్ 3.53 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 3.05 శాతం లాభపడ్డాయి.

Losers : పవర్‌గ్రిడ్ 2.27 శాతం, ఎస్బీఐ 1.77 శాతం, ఎన్టీపీసీ 0.87 శాతం, టాటా స్టీల్ 0.54 శాతం, ట్రెంట్ 0.33 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Mahanadi Coalfields IPO | ఇన్వెస్టర్లకు శుభవార్త.. త్వరలో కోల్ ఇండియా నుంచి మరో ఐపీవో!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *