BLS Polymers IPO | ఐపీవోకు పాలిమర్ కంపెనీ..

మెయిన్ బోర్డునుంచి మరో కంపెనీ ఐపీవో వస్తోంది. అక్టోబర్ 27న సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానుంది..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: BLS Polymers IPO | బీఎల్ఎస్ పాలిమర్స్ కంపెనీ వైర్లు, కేబుళ్లు, భూగర్భ పైప్‌లైన్‌లలో ఉపయోగించే ప్రత్యేక పాలిమర్ సమ్మేళనాలను తయారుచేస్తుంది. దీని ఉత్పత్తి శ్రేణిలో హెచ్డీపీఈ, ఎండీపీఈ, ఎల్ఎల్‌డీపీఈ, ఎక్స్ఎల్పీఈ, పీవీసీ, హెచ్ఎఫ్ఎఫ్ఆర్, కేబుల్ ఫిల్లింగ్ కాంపోనెంట్స్, అథేసివ్ కోటింగ్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఇది విద్యుత్, టెలికమ్యూనికేషన్స్, రైల్వేలు, నీరు, చమురు మరియు గ్యాస్ వంటి అనేక పరిశ్రమలకు సేవలు అందిస్తోంది.

BLS Polymers IPO | పలు దేశాలకు ఎగుమతులు..

బీఎల్ ఎస్ పాలిమర్స్ తయారీ కేంద్రం గోవాలో ఉంది. ఇది 11 యంత్రాలతో సుమారు 24,220 చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అంతేకాకుండా సొంత ఇన్ హౌస్ ల్యాబ్, నాణ్యత నియంత్రణ బృందం మరియు ఐఎస్ వో సర్టిఫికేషన్ ఉన్నాయి. ఈ సంస్థ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అనుకూలీకరించిన ఉత్పత్తులను కూడా రూపొందిస్తోంది. ఇప్పటివరకు 190 కంటే ఎక్కువ మంది వినియోగదారులకు సేవలు అందించింది. బంగ్లాదేశ్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యూఏఈ, యూఎసఏ, జాంబియా వంటి దేశాలకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది.

BLS Polymers IPO | రూ. 255 కోట్ల ఐపీవో..

ఐపీవో (IPO) ద్వారా రూ. 255 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఫ్రెష్ ఇష్యూ కింద రూ. 10 ఫేస్ వ్యాల్యూ కలిగిన 1.7 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించనుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సాధారణ కార్పొరేట్ అవసరాలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

BLS Polymers IPO | ప్రైస్ బ్యాండ్..

ధరల శ్రేణిని రూ. 142 నుంచి రూ. 150 లుగా కంపెనీ నిర్ణయించింది. ఒక లాట్ లో 100 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం రూ. 15 వేలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కోటా : క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్ఐఐలకు 15 శాతం వాటాను కేటాయించారు.

జీఎంపీ : బీఎల్ఎస్ పాలిమర్స్ లిమిటెడ్ కంపెనీ షేర్లకు సంబంధించి గ్రే మార్కెట్ ప్రీమియం రూ. 25 గా ఉంది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలో 17 శాతం వరకు లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశాలున్నాయి.

BLS Polymers IPO | ముఖ్యమైన తేదీలు..

ఐపీవో సబ్ స్క్రిప్షన్ అక్టోబర్ 27న ప్రారంభమై అక్టోబర్ 29న ముగియనుంది. షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ అక్టోబర్ 30న వెల్లడి కానుంది. ఈ కంపెనీ షేర్లు నవంబర్ 03న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి.

ఇది కూడా చదవండి..: Indian Stock Market | మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు.. నష్టాల్లోనే సూచీలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *