అక్షరటుడే, వెబ్‌డెస్క్: Phone Prices Hike | స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు షాక్ తగిలింది. ప్రముఖ మొబైల్ బ్రాండ్లు తమ స్మార్ట్‌ఫోన్‌ల ధరలను భారీగా పెంచాయి. ఒప్పో, వన్‌ప్లస్, iQOO, రెడ్‌మీ, వివోకు చెందిన పలు మోడళ్ల ధరలు పెరిగాయి.
Phone Prices Hike | రూ. 5 వేల వరకు పెంపు..
ఒప్పో రెనో Oppo Reno, A సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధరలను గరిష్ఠంగా రూ.5 వేల వరకు పెంచింది. దీంతో ఈ సిరీస్‌లలోని పలు మోడళ్లను కొనుగోలు చేసే వినియోగదారులపై అదనపు భారం పడనుంది.
iQOO కూడా తన ప్రముఖ మోడళ్ల ధరలను పెంచింది. iQOO 15 ధర రూ.13 వేల వరకు, iQOO 15R ధర రూ.9 వేల వరకు పెరిగింది.
ఇక రెడ్‌మీ టర్బో-5 ధరను రూ.4 వేల వరకు పెంచగా, POCO X8 Pro, X8 Pro Max మోడళ్ల ధరలను రూ.3 వేల వరకు పెంచినట్లు సమాచారం.
Phone Prices Hike | వన్‌ప్లస్ నార్డ్ 6 సిరీస్‌లో..
వన్‌ప్లస్ నార్డ్ 6 సిరీస్‌లోని పలు వేరియంట్ల ధరలు రూ.4 వేల వరకు పెరిగాయి. మరోవైపు వివో Y సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా రూ.4 వేల వరకు పెరిగాయి.
ప్రముఖ బ్రాండ్లకు చెందిన పలు మోడళ్ల ధరలు ఒకేసారి పెరగడంతో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులు ధరలను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.