అక్షరటుడే, వెబ్‌డెస్క్: Edla Venkatesh 5th Dan | నిజామాబాద్ Nizamabad నగరానికి చెందిన ప్రముఖ కరాటే మాస్టర్, అంతర్జాతీయ బ్రూస్లీ అవార్డు గ్రహీత, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ యూకే గోల్డ్ మెడలిస్ట్ ఎడ్ల వెంకటేష్ మార్షల్ ఆర్ట్స్ కరాటేలో 5వ డాన్ బ్లాక్ బెల్ట్ డిగ్రీని సాధించారు.
ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కరాటే మాస్టర్లలో చిన్న వయసులోనే 5వ డాన్ బ్లాక్ బెల్ట్ సాధించడం విశేషంగా నిలిచింది.
Edla Venkatesh 5th Dan | అడ్వాన్స్‌డ్ కటాస్‌పై ప్రత్యేక శిక్షణ
ఆగస్టు 16న ఆదివారం ఒకినవా మార్షల్ ఆర్ట్స్ – జపాన్ కరాటే షోటోకై ఇండియా గ్రాండ్ మాస్టర్ ఎస్. శ్రీనివాసన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ డాన్ బ్లాక్ బెల్ట్ కటాస్, స్పారింగ్ పరీక్షల్లో ఎడ్ల వెంకటేష్ ఉత్తమ ప్రతిభ కనబరిచి 5వ డాన్ డిగ్రీని సాధించారు. పరీక్ష అనంతరం గ్రాండ్ మాస్టర్ శ్రీనివాసన్ మార్షల్ ఆర్ట్స్‌లోని కీలకమైన అడ్వాన్స్‌డ్ కటాస్‌పై వెంకటేష్‌కు ప్రత్యేక శిక్షణ అందించారు.
Edla Venkatesh 5th Dan | నంబర్ వన్ జిల్లాగా నిలపడం లక్ష్యం
ఈ సందర్భంగా గ్రాండ్ మాస్టర్ ఎస్. శ్రీనివాసన్ మాట్లాడుతూ, నిజామాబాద్ నగరంలో గత 25 సంవత్సరాలుగా క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన కరాటే విద్యను అందించడంలో ఒకినవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, ఎడ్ల వెంకటేష్ ముందంజలో ఉన్నారని అభినందించారు.
ACB Trap Employee | ACB Trapలో ఉద్యోగి పట్టుబడితే వెంటనే ఉద్యోగం పోతుందా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఎడ్ల వెంకటేష్ మాట్లాడుతూ తన గ్రాండ్ మాస్టర్ ఎస్. శ్రీనివాసన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాను కరాటే రంగంలో నంబర్ వన్ జిల్లాగా నిలపడం తన లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెడ్‌క్వార్టర్స్ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.