May 13 Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ క్యూస్.. ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

Naresh Chandan
May 13 Market Analysis

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 13 Market Analysis | పశ్చిమాసియాలో అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో గత సెషన్‌లో వాల్ స్ట్రీట్, యూరోప్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బుధవారం ఉదయం ప్రధాన ఆసియా మార్కెట్లు మిశ్రమంగా సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు కూడా ఫ్లాట్ గా మొదలుకానున్నాయి.

May 13 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

గత సెషన్‌లో నాస్‌డాక్ 0.71 శాతం, ఎస్ అండ్ పీ 0.16 శాతం నష్టపోయాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.03 శాతం నష్టంతో ఉంది.

May 13 Market Analysis | యూరోప్ మార్కెట్లు..

జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.65 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.96 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.04 శాతం, నష్టపోయాయి.

May 13 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.54 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.21 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 1.19 శాతం లాభాలతో ఉండగా..హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.47 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 1.19 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.08 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.03 శాతం లాభంతో కొనసాగుతుండడంతో మన మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు వరుసగా ఆరో సెషన్‌లోనూ నికర అమ్మకందారులుగా నిలిచారు. గత సెషన్‌లో నికరంగా రూ. 1,959 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు వరుసగా పన్నెండో సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 7,990 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.76 నుంచి 0.93 కి పెరిగింది.
  • విక్స్ 3.92 శాతం పెరిగి 19.28 వద్ద ఉంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 106.89 డాలర్ల వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 98.33 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.46 వద్ద ఉన్నాయి.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 31 పైసలు బలహీనపడి 95.63 వద్ద ఉంది.

T-SAT Education Department | ఇక విద్యాశాఖ పరిధిలోకి టీ-శాట్.. ఐటీ శాఖ నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *