Indian Stock Market | మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు.. నష్టాల్లోనే సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 483 పాయింట్లు, నిఫ్టీ 182 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indian Stock Market | పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలతో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 110 డాలర్లపైనే ట్రేడ్ అవుతున్నాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై, కార్పొరేట్ సంస్థల లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళనలను పెంచుతోంది.

దీంతో భారతీయ స్టాక్ మార్కెట్‌ (Stock Market)లో నష్టాల పరంపర కొనసాగుతోంది. ప్రధాన సూచీలు వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. అన్ని రంగాలలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. ప్రధానంగా మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్ భారీ పతనాన్ని చూస్తున్నాయి.

Indian Stock Market | కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు..

దేశీయ స్టాక్ మార్కెట్ ప్రారంభంలోనే తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. దీంతో నిమిషాల్లో రూ. 6 లక్షల కోట్ల సంపద ఆవిరయ్యింది. అయితే కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో ప్రధాన సూచీలు ప్రారంభ నష్టాలను తగ్గించుకున్నాయి. గురువారం ఉదయం 366 పాయింట్ల గ్యాప్ డౌన్ లో ప్రారంభమైన సెన్సెక్స్.. అక్కడినుంచి మరో 338 పాయింట్లు నష్టపోయింది. ఇంట్రాడే కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు వాల్యూ బయ్యింగ్‌కు దిగడంతో కోలుకుని 715 పాయింట్లు ఎగబాకింది. 124 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన నిఫ్టీ.. మరో 133 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 231 పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 483 పాయింట్ల నష్టంతో 73,226 వద్ద, నిఫ్టీ 182 పాయింట్ల నష్టంతో 22,629 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 7 స్టాక్స్ లాభాలతో, 23 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. ఎల్టీ 0.80 శాతం, ఎటర్నల్ 0.71 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.64 శాతం, ఎయిర్‌టెల్ 0.45 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.31 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : టెక్ మహీంద్రా 2.20 శాతం, ఆసియన్ పెయింట్ 1.97 శాతం, పవర్‌గ్రిడ్ 1.77 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.66 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.63 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: Oct 22 Gold Prices | దేశీయంగా తగ్గిన బంగారం ధరలు.. అంతర్జాతీయ మార్కెట్‌లో పుంజుకున్న పసిడి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *