Banking Stocks Rally | రాణిస్తున్న బ్యాంకింగ్ స్టాక్స్.. లాభాల్లో ప్రధాన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల బాటలో సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 475 పాయింట్లు, నిఫ్టీ 138 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Banking Stocks Rally | పశ్చిమాసియా నుంచి చమురు ఎగుమతులు పెరగడంతోపాటు సరఫరాలను పెంచుతామని జీ7 దేశాలు పేర్కొనడంతో ముడి చమురు ధరలు తగ్గుతున్నాయి. బ్యారెల్‌కు వంద డాలర్ల దిగువకు క్రూడ్ ఆయిల్ ధర వచ్చింది.

దీంతో గ్లోబల్ మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. దీనికితోడు రెండో త్రైమాసికంలో బ్యాంకుల అడ్వాన్సులు, డిపాజిట్లలో పెరుగుదలను రిపోర్ట్ చేయడంతో బ్యాంకు స్టాక్‌లలో కొనుగోళ్ల మద్దతు కనిపిస్తోంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లో బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా రెండో సెషన్‌లోనూ లాభాలతో ఉన్నాయి.

Banking Stocks Rally | గ్యాప్ అప్ లో ప్రారంభం..

దేశీయ మార్కెట్లు (Domestic markets) మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 126 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా తొలుత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని 124 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి కోలుకుని 471 పాయింట్లుపైకి ఎగబాకింది. నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. మొదట్లో 42 పాయింట్లు తగ్గి అక్కడినుంచి కోలుకుని 139 పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 475 పాయింట్ల లాభంతో 72,857 వద్ద, నిఫ్టీ 138 పాయింట్ల లాభంతో 22,694 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 19 స్టాక్స్ లాభాలతో, 11 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. ట్రెంట్ 10.72 శాతం, కోటక్ బ్యాంక్ 3.63 శాతం, రిలయన్స్ 2.56 శాతం, ఎటర్నల్ 1.62 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.57 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : టెక్ మహీంద్రా 2.50 శాతం, టైటాన్ 1.31 శాతం, ఐటీసీ 1.21 శాతం, ఇన్ఫోసిస్ 1.16 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.74 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Oct 06 Gold Prices | బంగారం ధరలు స్థిరం.. వెండి స్వల్పంగా తగ్గే అవకాశం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *