May 26 Gold Rates | పశ్చిమాసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్.. ఆకాశాన్నంటుతున్న బంగారం ధర!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 26 Gold Rates | పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ భయాలు, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు భారీగా బంగారం వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లుతున్నారు.

దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు Silveer Prices వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ముడి చమురు ధరల్లో ఒడుదుడుకులు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత కారణంగా బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగాయి. సాధారణంగా మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆస్తిగా భావిస్తారు. ప్రస్తుతం అదే పరిస్థితి కొనసాగుతోంది.

Gold ETF Surge

May 26 Gold Rates | గరిష్ట స్థాయికి..

హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి బంగారం ధరలు Gold Rates భారీ స్థాయిలో నమోదయ్యాయి. మంగళవారం ఉదయం కూడా ఈ ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు.

హైదరాబాద్‌లో ఇవాళ బంగారం ధరలు (10 గ్రాములకు)గాను 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం: రూ.1,59,390 కాగా, 22 క్యారెట్ల బంగారం: రూ.1,46,110గా ఉంది.ఇక 18 క్యారెట్ల బంగారం: రూ.1,19,550గా న‌మోదైంది.

ఇప్పటికే బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకోవడంతో కొనుగోలుదారులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ధరలు భారంగా మారుతున్నాయి.

May 26 Gold Rates | వెండి ధరల్లో కూడా

వెండి ధరలు కూడా భారీగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల వెండి: రూ.29,490 కాగా, కిలో వెండి: రూ.2,94,900గా ఉంది. పరిశ్రమల వినియోగం, పెట్టుబడి డిమాండ్ పెరగడం కూడా వెండి ధరల పెరుగుదలకు కారణమవుతోందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములకు) ఎలా ఉంది అంటే..

  • హైదరాబాద్ – రూ.1,59,390
  • విజయవాడ – రూ.1,59,390
  • విశాఖపట్నం – రూ.1,59,390
  • ముంబై – రూ.1,59,390
  • బెంగళూరు Bangalore – రూ.1,59,390
  • ఢిల్లీ – రూ.1,59,440
  • చెన్నై – రూ.1,61,250
  • సూరత్ – రూ.1,59,440
  • మధురై – రూ.1,61,250
  • కోయంబత్తూరు – రూ.1,61,250

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పశ్చిమాసియా పరిస్థితులు త్వరగా సాధారణ స్థితికి రాకపోతే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

BC Leader Targeted | కులాధిపత్య మీడియా ‘కుట్రల’ బట్టబయలు: బీసీ…

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *