May 26 Market Analysis | మిశ్రమంగా ఆసియా మార్కెట్లు.. నెగెటివ్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 26 Market Analysis | అమెరికా -ఇరాన్ శాంతి చర్చలపై కొనసాగుతున్న అనిశ్చితి, ఇరాన్‌పై ఆత్మరక్షణ దాడులు నిర్వహించినట్లు అమెరికా ప్రకటించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి.

యూఎస్ స్టాక్ ఫ్యూచర్స్ మాత్రం లాభాల్లో ట్రేడ్ ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లనుంచి అందుతున్న మిశ్రమ సంకేతాలు, క్రూడ్ ఆయిల్ ధర మళ్లీ కాస్త పెరగడం కారణంగా భారత స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ నెగెటివ్ గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

May 26 Market Analysis | యూఎస్ మార్కెట్లు..

మెమోరియల్ డే హాలిడే సందర్భంగా గత సెషన్ లో అమెరికా మార్కెట్లు మూసి ఉన్నాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.65 శాతం లాభంతో ఉంది.

akshara today 1 6.jpgmarket 6

May 26 Market Analysis | ఆసియా మార్కెట్లు..

ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 3.09 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.30 శాతం లాభాలతో ఉండగా.. జపాన్‌కు చెందిన నిక్కీ 0.44 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.48 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.21 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.21 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.36 శాతం నష్టంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు గ్యాప్ డౌన్ లో ప్రారంభం కానున్నాయి.

May 26 Market Analysis | గమనించాల్సిన అంశాలు..

  • ఎఫ్ఐఐలు నాలుగు సెషన్‌ల తర్వాత నికర కొనుగోలుదారులుగా మారారు. గత సెషన్‌లో నికరంగా రూ. 821 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
  • డీఐఐలు 6వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 3,856 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
  • నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.08 నుంచి 1.26 కు పెరిగింది.
  • విక్స్ 6.28 శాతం తగ్గి 16.70 వద్ద ఉంది. విక్స్ బుల్స్‌కు అనుకూలంగా మారుతోంది. ఇది 15 కన్నా దిగువకు వస్తే బుల్స్ లో విశ్వాసం మరింత పెరుగుతుంది.
  • బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 98.11 డాలర్ల వద్ద ఉంది.
  • డాలర్‌తో రూపాయి మారకం విలువ 47 పైసలు బలపడి 95.23 వద్ద ఉంది.
  • యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.06 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.51 వద్ద ఉన్నాయి.
  • నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీతోపాటు మంత్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో తీవ్ర ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.

Varalakshmi Controversial Comments | మగాడు కేవలం ‘స్పేర్ పార్ట్’ మాత్రమేనా?…..

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *