అక్షరటుడే, వెబ్‌డెస్క్: June 16 Market Analysis | అమెరికా -ఇరాన్ శాంతి ఒప్పందంలోని కీలక వివరాల కోసం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నందున ప్రపంచ మార్కెట్ల(Global markets)లో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. యూఎస్ స్టాక్ మార్కెట్ గత సెషన్‌లో లాభాలతో, యూరోప్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి.
ఆసియా మార్కెట్లు మంగళవారం ఉదయం మిశ్రమంగా సాగుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ (Gift nifty) క్రితం ముగింపుతో పోలిస్తే స్వల్ప లాభాలతో ట్రేడ్ అవుతోంది. ఇది భారత స్టాక్ మార్కెట్‌లోని బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్‌గా ప్రారంభమవుతాయని సూచిస్తోంది.
June 16 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
వాల్‌స్ట్రీట్ సోమవారం లాభాలతో ముగిసింది. గత సెషన్‌లో నాస్‌డాక్ 3.07 శాతం, ఎస్ అండ్ పీ 1.65 శాతం లాభపడగా.. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.04 శాతం లాభంతో ఉంది.
June 16 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
జర్మనీకి చెందిన డీఏఎక్స్ 1.04 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.40 శాతం పెరగ్గా.. యూకేకు చెందిన ఎఫ్ టీఎస్ ఈ 0.39 శాతం నష్టపోయాయి.
June 16 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.45 గంటల ప్రాంతంలో సౌత్ కొరియాకు చెందిన కోస్పీ(Kospi) 1.39 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.44 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.24 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.02 శాతం లాభాలతో ఉండగా.. హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.95 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.06 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.02 శాతం లాభంతో ఉండడంతో మన మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐ(FII)లు వరుసగా 13 సెషన్ల తర్వాత నికర కొనుగోలుదారులుగా మారారు. గత సెషన్‌లో నికరంగా రూ. 200 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- డీఐఐలు 20వ సెషన్‌లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్‌లో నికరంగా రూ. 3,189 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.41 నుంచి 0.99 తగ్గింది.
- విక్స్ 2.48 శాతం తగ్గి 14.35 వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 41 పైసలు బలపడి 94.71 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.66 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.48 వద్ద ఉన్నాయి.
- అమెరికా -ఇరాన్ ప్రాథమిక శాంతి ఒప్పందంలో వివరాలు లేకపోవడంపై ఆందోళనల నేపథ్యంలో ముడి చమురు ధరలు కాస్త పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 83.33 డాలర్ల వద్ద ఉంది.
నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్‌పైరీ నేపథ్యంలో మార్కెట్‌లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.