June 16 Horoscope | అరుదైన యోగాల కలయిక.. ఈ రాశుల వారి నేడు ఎలా ఉండబోతున్నాయంటే..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: June 16 Horoscope | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఆరుద్ర నక్షత్ర ప్రభావంతో పాటు వృద్ధి, ధ్రువ , త్రిపుష్కర యోగాల కలయిక వల్ల నేడు (మంగళవారం, జూన్​ 16) గ్రహగతుల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

ఈ అరుదైన శుభ యోగాల ప్రభావంతో చాలా మందికి అన్ని రంగాల్లోనూ విజయాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా కుజుడి స్థానం బలపడటం , హనుమంతుని అనుగ్రహం తోడవ్వడం వల్ల ఇవాళ ఎంతో అనుకూలంగా మారింది.

June 16 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: June 16 Horoscope | త్రిపుష్కర యోగ ప్రభావంతో మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయ వనరులు విస్తరిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లేదా కొత్త అవకాశాల గురించి శుభవార్తలు అందవచ్చు. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది, అయితే ఆరోగ్యం విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి.

వృషభ రాశి: June 16 Horoscope | ఇవాళ మీకు మిశ్రమ ఫలితాలు ఉండనున్నాయి. శుక్ర, గురు గ్రహాల సంచారం వల్ల చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. పెద్దల ఆశీస్సులు తీసుకుని రోజును ప్రారంభిస్తే మరింత అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం వేళ ఆలయ సందర్శన వల్ల మనశ్శాంతి కలుగుతుంది, దానధర్మాల పట్ల ఆసక్తి చూపుతారు.

మిథున రాశి: June 16 Horoscope | పనుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, అంచనాలు తప్పే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరమైన నిర్ణయాల్లో బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని అడుగు వేయండి. నిరుద్యోగులకు కెరీర్ పరంగా ఆశాజనకమైన ఫలితాలు వచ్చే సూచనలు ఉన్నాయి.

కర్కాటక రాశి: June 16 Horoscope | ఆర్థికంగా ఇవాళ సానుకూలంగా ఉంది. ఎమోషనల్‌గా నిర్ణయాలు తీసుకుని ఖర్చులు చేయకండి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యాలయంలో కుజుడి ప్రభావంతో పనులు సజావుగా సాగుతాయి, అయితే ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ అవసరం.

సింహ రాశి: June 16 Horoscope | సూర్య, చంద్ర, బుధ గ్రహాల అనుకూల స్థితి వల్ల ఇవాళ అత్యంత శుభప్రదంగా ఉంటుంది. వ్యాపార రంగంలో మంచి లాభాలు పొందుతారు. సమాజంలో హోదా పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులతో పాటు ఆస్తి సంబంధిత గొడవలు పరిష్కారమవుతాయి.

కన్యా రాశి: June 16 Horoscope | ఇవాళ మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గ్రహబలం అనుకూలంగా ఉండటం వల్ల మీరు తలపెట్టిన పనులన్నీ అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. విద్యార్థులకు ఇవాళ అనుకూల సమయం.

తులా రాశి: అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. గురు, శుక్ర గ్రహాల ప్రభావం మీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడం మంచిది.

వృశ్చిక రాశి: ఎప్పటి నుంచో వేధిస్తున్న సమస్యలకు ఇవాళ ముగింపు దశకు చేరుకుంటాయి. ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు విజయావకాశాలు లభించనున్నాయి. విదేశీ ప్రయాణాలకు మార్గం సుగమం కావచ్చు.

ధనుస్సు రాశి: మీకు అద్భుతమైన అవకాశాలు లభించనున్నాయి. ఆర్థిక పరంగా ఎంతో పురోగతి ఉంటుంది, కోల్పోయిన సొమ్ము తిరిగి వచ్చే అవకాశం ఉంది. పాత అప్పులు తీరిపోతాయి. కుటుంబంలో తోబుట్టువుల మద్దతు మీకు ఉత్సాహాన్నిస్తుంది.

మకర రాశి: ఇవాళ మీకు చాలా ప్రత్యేకమైన రోజు. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగంలో ఎదుగుదల, ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి. కుటుంబంతో గడిపే సమయం మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది.

కుంభ రాశి: ఆర్థికంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. రిస్క్ తో కూడిన పెట్టుబడుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో అధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో మంచి ఫలితాలు ఉంటాయి, ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు.

మీన రాశి: కుటుంబ బాధ్యతల వల్ల అదనపు ఖర్చులు తప్పకపోవచ్చు. శని గ్రహ సంచారం దృష్ట్యా పనిలో మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందకుండా, సమతుల్యమైన ఆహారం తీసుకోండి.

Phule Ambedkar Ideology | మేధో సంపత్తి గులాంగిరి ఇంకెన్నాళ్లు..? బ్లూ ప్రింట్​ ఇదిగో.. రండి.. బహుజన రాజ్యాధికారం చేజిక్కించుకుందాం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *