Sep 16 Horoscope | ఆఫీసులో తిరుగులేని హవా.. సీనియర్ల ప్రశంసలతో మారనున్న ఈ రాశుల వారి రేంజ్

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sep 16 Horoscope | గ్రహాల స్థితిగతులు, నక్షత్ర గమనం ప్రకారం ద్వాదశ రాశుల జీవితంలో నేడు (బుధవారం, సెప్టెంబరు 16) కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఉద్యోగంలో అనుకోని పురోగతి, వ్యాపారంలో ఊహించని ధనలాభం సాధించే అవకాశాలు కొందరికి స్పష్టంగా కనిపిస్తుంటే, మరికొందరు ఆర్థిక విషయాలు , ఆరోగ్య పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.

Sep 16 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: Sep 16 Horoscope | ఆర్థికంగా ఒడుదుడుకులు ఎదురవ్వకుండా ఉండాలంటే అనవసర ఖర్చులను తగ్గించుకుని పొదుపుపై దృష్టి పెట్టడం చాలా అవసరం. ఉద్యోగంలో సహోద్యోగులతో మర్యాదగా, సహకారంతో వ్యవహరించడం వల్ల అను అనుకూల ఫలితాలు సాధించగలుగుతారు. రోజు చివరిలో మనశ్శాంతి లభిస్తుంది.

వృషభ రాశి: Sep 16 Horoscope | అనుకోని పరిస్థితుల వల్ల కొంత అసౌకర్యం కలిగినా, తొందరపడకుండా ఓర్పు , సహనంతో వ్యవహరించడం మంచిది. ఇవాళ తొందరపాటుతో ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి, ప్రత్యేకించి దీర్ఘకాలిక పెట్టుబడులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు నిరంతరం చేస్తున్న కృషికి తగిన ప్రతిఫలం, గుర్తింపు ఈ రోజు లభిస్తాయి.

మిథున రాశి: Sep 16 Horoscope | మీరు సాధించిన విజయాలు, ఇంట్లో జరిగే చిన్నచిన్న వేడుకలు రోజంతా అమితమైన సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి. పాత మిత్రులకు ఆర్థిక సహాయం చేయాల్సి రావడం వల్ల కొంత ఒత్తిడి అనిపించినా, సమయస్ఫూర్తితో సమస్యను పరిష్కరించగలరు. ఆఫీసులో నిలిచిపోయిన పనులను పూర్తి చేయడం ద్వారా ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు.

కర్కాటక రాశి: Sep 16 Horoscope | ఇవాళ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. తొందరపడి ఎవరితోనూ ఘర్షణకు దిగవద్దు. పాత అప్పులు తీరడానికి మార్గం సుగమమవ్వడంతో ఆర్థికంగా చాలా పెద్ద ఉపశమనం లభిస్తుంది. ఆఫీసులో పనిపై పూర్తి శ్రద్ధ వహిస్తూ, సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగితే మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.

సింహ రాశి: Sep 16 Horoscope | ఆర్థిక, పన్నుల వ్యవహారాల్లో అజాగ్రత్తగా ఉండకుండా అన్ని పత్రాలను సరిచూసుకోవడం మంచిది. ఇవాళ ఆధ్యాత్మిక ప్రదేశాలను లేదా పుణ్యక్షేత్రాలను సందర్శించడం వల్ల ప్రశాంతత లభిస్తుంది.

ఆఫీసులో మీరు ఎదురుచూస్తున్న ప్రశంసలు కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉంది. అనుభవజ్ఞులైన పెద్దల సలహాలు తీసుకుంటూ ముందుకు సాగడం వల్ల రాబోయే రోజుల్లో మంచి లాభాలు ఉంటాయి. రోజూ ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ మంత్రాన్ని 28 లేదా 108 సార్లు జపించండి.

కన్యా రాశి: Sep 16 Horoscope | అనుకోని ధనలాభం లేదా గతంలో చేసిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగవుతుంది. ఆఫీసులో మీ నైపుణ్యానికి, కష్టపడే తత్వానికి సీనియర్లు , సహోద్యోగుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. చిన్నచిన్న కుటుంబ విషయాలను పెద్దది చేయకుండా ప్రశాంతంగా ఉండటం శ్రేయస్కరం.

తులా రాశి: Sep 16 Horoscope | భారీ ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు తగదు, నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం. ఆఫీసులో అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టడం శ్రేయస్కరం. స్నేహితులతో సరదాగా గడుపుతూనే, మీ ముఖ్యమైన బాధ్యతలను నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేయండి.

వృశ్చిక రాశి: Sep 16 Horoscope | స్వార్థపూరిత వ్యక్తుల వల్ల మీ మానసిక ప్రశాంతత దెబ్బతినకుండా వారితో దూరం పాటించడం మంచిది. ఆర్థికంగా పెట్టుబడులు అనుకూలించి మంచి లాభాలను తెచ్చిపెడతాయి. గృహోపకరణాలు లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆఫీసులో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందడానికి శ్రమించాల్సి ఉంటుంది.

ధనుస్సు రాశి: దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఒత్తిడి, అలసట నుంచి విముక్తి లభించి మీ మనస్సు ఎంతో తేలికపడుతుంది. ఇంట్లోని పెద్దల సహకారం లభించడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి సులువుగా బయటపడతారు. కొత్త వ్యాపార లేదా ఉద్యోగ ప్రతిపాదనలు ఆకర్షణీయంగా ఉన్నా, వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆలోచించడం మంచిది.

Samantha Seemantham | సీమంతంలో శ్రీవిద్యా సొబగులు..కళా ఆవరణలో మాతృత్వానికి దైవత్వపు అభిషేకం!

మకర రాశి: భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే పొదుపు చేయడం ప్రారంభించడం చాలా శ్రేయస్కరం. గృహావసరాలకు సంబంధించిన ముఖ్యమైన వస్తువుల కొనుగోలు చేస్తారు. ఆఫీసులో మీ సమర్థవంతమైన పనితీరుతో ప్రతి విషయంలోనూ మీదే పైచేయి కానుంది.

కుంభ రాశి: చాలాకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి లభించి పూర్తి ఉత్సాహంతో ఉంటారు. పాత బాకీలు ఊహించని విధంగా వసూలూ అవ్వడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీసులో మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడి నిలిచిపోయిన పనులన్నీ సులువుగా పూర్తవుతాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి.

మీన రాశి: ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించడం చాలా మంచిది. ఆర్థిక పరిస్థితులలో స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది, ఇది మీకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడతాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా కొత్త , ఉపయోగకరమైన పరిచయాలు ఏర్పడతాయి.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *