అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sep 16 Market Analysis | పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలతో పెరుగుతున్న ముడి చమురు ధరలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ద్రవ్యోల్బణ భయాలకు తోడు యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరగడమూ దీనికి కారణం. దీంతో 2023 తర్వాత తొలిసారిగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలతో ఈక్విటీ మార్కెట్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
Sep 16 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్లో నాస్డాక్ 0.78 శాతం, ఎస్ అండ్ పీ 0.45 శాతం పడిపోయాయి. బుధవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.10 శాతం లాభంతో ఉంది.
Sep 16 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.34 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.15 శాతం, యూకేకు చెందిన ఎఫ్టీఎస్ ఈ 0.37 నష్టంతో ముగిశాయి.
Sep 16 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా Asia మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 7.50 గంటల ప్రాంతంలో సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.43 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.36 శాతం, సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 0.20 శాతం లాభాలతో ఉండగా.. చైనాకు చెందిన షాంఘై 0.34 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 0.28 శాతం, హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 0.22 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 0.09 శాతం లాభంతో ఉండటంతో మన మార్కెట్లు ఫ్లాట్ టు గ్యాప్ అప్ లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
గమనించాల్సిన అంశాలు..
- విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వరుసగా ఐదో సెషన్లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 2,977 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మారు.
- డీఐఐలు వరుసగా 25 వ సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 2,686 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 40 పైసలు బలహీనపడి 95.96 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.72 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 5 వద్ద ఉన్నాయి.
- క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 108.44 డాలర్ల వద్ద ఉంది.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 1.01 నుంచి 0.83 కి తగ్గింది.
- విక్స్ 9.34 శాతం పెరిగి 13.43 వద్ద ఉంది.