IT Crash | ఐటీలో క్రాష్.. కుదేలైన ప్రధాన కంపెనీల షేర్లు!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: IT Crash | ఏఐ రాకతో సంప్రదాయ సర్వీస్ బిజినెస్ మోడల్‌లో పనిచేస్తున్న ఐటీ కంపెనీలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. ఆంథ్రోపిక్స్ టూల్స్‌తో ప్రారంభమైన పతనం కొనసాగుతోంది.

తాజాగా వెలువడిన హెచ్‌సీఎల్ టెక్ త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతోపాటు బలహీనమైన భవిష్యత్ అంచనాల కారణంగా బుధవారం ఐటీ షేర్లు కుప్పకూలాయి. నిఫ్టీ (Nifty) ఐటీ ఇండెక్స్ సుమారు 4 శాతం నష్టపోగా.. హెచ్‌సీఎల్ టెక్ షేర్ 11 శాతం పతనమైంది. డిమాండ్ తగ్గడం, ఏఐ భయాలు, ప్రాజెక్టుల జాప్యంతో ఐటీ రంగం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది.

IT Crash | దిగ్గజ సంస్థలన్నీ నష్టాల్లోనే..

దేశీయ స్టాక్ మార్కెట్‌ (Domestic Stock Market)లోని ఐటీ దిగ్గజ సంస్థలన్నీ బుధవారం భారీ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫలితాల అనంతరం కంపెనీ మేనేజ్‌మెంట్ ఇచ్చిన నెగెటివ్ కామెంట్స్ మొత్తం ఐటీ రంగంపై ప్రభావం చూపాయి. సంస్థ రెవెన్యూ గైడెన్స్ (ఎఫ్ వై27) కేవలం 1.5 – 4.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. దీంతో సంప్రదాయ ఐటీ కంపెనీలలో వృద్ధి వేగం ఆగిపోయిందనే సంకేతాలు వెలువడ్డాయి. ఐటీ సెక్టార్ మొత్తం ప్రాజెక్టుల జాప్యం మ్యాక్రో ఎకనామిక్ ఒత్తిళ్లతో సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పట్లో రికవరీకి సైతం అవకాశాలు లేకపోవడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. హెచ్‌సీఎల్ టెక్ షేర్ 11 శాతం పడిపోయి 11 ఏళ్లలో చూడని అత్యంత దారుణమైన పతనాన్ని చూసింది. పర్సిస్టెంట్ సిస్టమ్ 4.9 శాతం, కోఫోర్జ్ 4.25 శాతం, ఇన్ఫోసిస్ 3.38 శాతం, ఎల్‌టీఎం 3.11 శాతం, ఎంఫసిస్ 3 శాతం, టీసీఎస్ 2.9 శాతం, టెక్ మహీంద్రా 2.50 శాతం నష్టపోయాయి.

IT Crash

IT Crash | భయపెడుతున్న ఏఐ

ఐటీ రంగాన్ని ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) భయపడుతోంది. ఏఐ రాకతో సంప్రదాయ సర్వీస్ బిజినెస్ మోడల్ మారుతుందనే ఆందోళన నెలకొంది. ఈ బిజినెస్ మోడల్ పూర్తిగా మారి, మళ్లీ ట్రాక్‌లోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశాలున్నాయి.

ఇది కూడా చదవండి..: IT Stocks | పడేసిన ఐటీ.. భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *