Lakshmi Narasimha Temple | లక్ష్మీ నృసింహస్వామి ఆలయాభివృద్ధికి కృషి చేస్తా: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

Shashi kiran Mottala
Lakshmi Narasimha Temple | లక్ష్మీ నృసింహాస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

అక్షరటుడే, కామారెడ్డి: Lakshmi Narasimha Temple | చుక్కాపూర్ లక్ష్మీనృసింహస్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Shabbir Ali) అన్నారు. మాచారెడ్డి (machareddy) మండలం చుక్కాపూర్ (Chukkapur) లక్ష్మీ నృసింహాస్వామి ఆలయంలో దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన ఆశీర్వచన భవనాన్ని, భక్తులు ఉండేందుకు నిర్మించిన గృహాలను బుధవారం ఆయన ప్రారంభించారు. అలాగే పలు కాటేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఆలయానికి వచ్చిన షబ్బీర్ అలీకి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

Lakshmi Narasimha Temple | ఎంతో మహిమ గల ఆలయం..

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. చుక్కాపూర్ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయం ఎంతో మహిమగలదని, స్వామివారి అనుగ్రహంతోనే తనకు ఆలయ అభివృద్ధి చేసే అవకాశం కలిగిందని తెలిపారు. మతభేదాలు లేకుండా భక్తి భావంతో సేవ చేయడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఛైర్మన్ కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి విశేషంగా జరిగిందని, అందుకే ఆయనను తిరిగి ఛైర్మన్‌గా నియమించామని తెలిపారు.

భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా(Kamareddy) డీసీసీ మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ నర్సింగ్​ రావు, కాంగ్రెస్ పాల్వంచ మండలాధ్యక్షుడు రమేష్ గౌడ్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, మాచారెడ్డి మండల అధ్యక్షుడు నౌసి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

45344

ఇది కూడా చదవండి: Kaleshwaram Case Appeal | కాళేశ్వరం కేసు.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకు సర్కార్!

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *