నిజామాబాద్Nizamabad Chain Snatching | బరితెగించిన చైన్​ స్నాచర్లు.. మూడున్నర తులాల బంగారం గొలుసు అపహరణ!

Nizamabad Chain Snatching | బరితెగించిన చైన్​ స్నాచర్లు.. మూడున్నర తులాల బంగారం గొలుసు అపహరణ!

నిజామాబాద్ నగరంలో చైన్​ స్నాచర్లు రెచ్చిపోయారు. ఒకేరోజు మూడు చోట్ల దోపిడీకి యత్నించారు. నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో చైన్ స్నాచింగ్ చేశారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nizamabad Chain Snatching | నిజామాబాద్ నగరంలో చైన్​ స్నాచర్లు రెచ్చిపోయారు. ఒకేరోజు మూడు చోట్ల దోపిడీకి యత్నించారు. నగరంలోని  నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి శ్రీనగర్ కాలనీలో ఈ రోజు (గురువారం, మే 07) ఉదయం ఆరున్నర గంటల సమయంలో చైన్ స్నాచింగ్ చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి స్థానిక మహిళ మెడలో ఉన్న మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు.

Nizamabad Chain Snatching | మహారాష్ట్రకు చెందిన వారుగా

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే అంతకు ముందు ఈ దొంగలు నగరంలోని మూడో టౌన్​ దుబ్బ ప్రాంతంలో వాకింగ్​ చేస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు యత్నించారు. కానీ, సదరు మహిళ వెంటనే అలెర్ట్​ అయి గొలుసును గట్టిగా పట్టుకోవడంతో దొంగల ప్రయత్నం ఫలించలేదు.

అక్కడి నుంచి గాయత్రీనగర్​కు చేరుకున్న దుండగులు స్థానిక మహిళ మెడలో నుంచి కూడా చైన్​ లాక్కెళ్లేందుకు ప్రయత్నించి, విఫలం అయ్యారు. ఇక, చివరగా శ్రీనగర్​ కాలనీకి చేరుకుని చైన్​ స్నాచింగ్​కు పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా, మహిళ మెడలో నుంచి చైన్​ లాగే ముందు దుండగులు హిందీలో మాట్లాడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చైన్​ స్నాచర్లు మహారాష్ట్రకు చెందిన వారుగా అనుమానిస్తున్నారు.

ఈ ఘటనలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే సీసీటీవీ ఫుటేజీలను సేకరిస్తూ దొంగలను గుర్తించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నగరంలో చైన్ స్నాచింగ్ ఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికులు, మహిళలలో భయాందోళన పెరుగుతోంది.

Nizamabad Road Accident | వేగంగా దూసుకెళ్లిన డెంటల్​ విద్యార్థి.. కారు ఢీకొని చిన్నారి దుర్మరణం

 

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Yellareddy Road Accident | ఎల్లారెడ్డి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం – చెట్టును ఢీకొని వ్యక్తి మృతి

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy Road Accident | మండలంలోని (Yellareddy) కొత్త...

Kodandaram TJS Meeting|ప్రజా సమస్యలపై పోరాటమే టీజేఎస్ లక్ష్యం: ఎమ్మెల్సీ కోదండరాం

Kodandaram TJS Meeting|గత ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించడమే కాకుండా, తెలంగాణ...

Operation Sindoor | ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుంది : భారత ఆర్మీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ నిర్వహించి ఏడాది...

Mega Job Mela | మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Mega Job Mela | మెగా...