అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tank Bund Ganesh Immersion | హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ (అప్పర్ ట్యాంక్ బండ్) పై వినాయక విగ్రహాల నిమజ్జనంపై అధికారులు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ రహదారి నుంచి విగ్రహాలను చెరువులో వేయడాన్ని పూర్తిగా నిషేధించారు.
Tank Bund Ganesh Immersion | హైకోర్టు నిబంధనలను గుర్తుచేస్తూ..
ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), హైదరాబాద్ నగర పోలీస్ శాఖ సంయుక్తంగా అప్పర్ ట్యాంక్ బండ్ వెంట భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ పేరిట వెలసిన ఈ ఫ్లెక్సీల్లో.. హైకోర్టు నిబంధనలను గుర్తుచేస్తూ.. భక్తులు, ఉత్సవ నిర్వాహకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ట్యాంక్ బండ్‌కు ప్రత్యామ్నాయంగా నగరం నలుమూలలా నిర్మించిన కృత్రిమ నిమజ్జన కుంటలు (Baby Ponds), అలాగే ప్రత్యేక ఘాట్‌లను ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు.
Tank Bund Ganesh Immersion | ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఎలా..
ట్యాంక్ బండ్ మెయిన్ రోడ్డుపై నిమజ్జనాన్ని నిషేధించిన నేపథ్యంలో.. నగరంలోనే అత్యంత భారీగా కొలువుదీరే ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనంపై భక్తుల్లో ఉత్కంఠ నెలకొంది.
అప్పర్ ట్యాంక్ బండ్ పై నిమజ్జనం లేకపోయినా, ఎన్టీఆర్ మార్గ్ (NTR Marg) వైపు ఉన్న ఘాట్‌లు, పీపుల్స్ ప్లాజా సమీపంలో భారీ విగ్రహాల కోసం ప్రత్యేక క్రేన్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఖైరతాబాద్ వినాయకుడిని సంప్రదాయబద్ధంగా ఎన్టీఆర్ మార్గ్‌లోని ప్రత్యామ్నాయ ఘాట్ వద్దే నిమజ్జనం చేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Samantha Seemantham | సీమంతంలో శ్రీవిద్యా సొబగులు..కళా ఆవరణలో మాతృత్వానికి దైవత్వపు అభిషేకం!
మట్టి విగ్రహాల వినియోగం: గత కొన్ని సంవత్సరాలుగా ఖైరతాబాద్ ఉత్సవ సమితి పర్యావరణహిత మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం ఇస్తుండటంతో, నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు ప్రత్యేక మార్గదర్శకాలు అమలు చేయనున్నారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులతో పాటు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనోత్సవం పూర్తి చేసేందుకు పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నారు.